BREAKING
Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | వృశ్చిక రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | తులా రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | కన్యా రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani హైదరాబాద్‌లో నేడు రాహుల్ గాంధీ ర్యాలీ..గిగ్ వర్కర్లతో ముఖాముఖి Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | సింహ రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani అమెరికాలో విమాన సేవలకు బ్రేక్!కమ్యూనికేషన్ వైఫల్యంతో దేశవ్యాప్త ‘గ్రౌండ్‌స్టాప్’.. అమెరికాలో దేశవ్యాప్త విమాన నిలిపివేత ఎత్తివేత... రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులు: ఏడుగురు మృతి, ఇంధన మరియు పౌర నివాసాలపై తీవ్ర ప్రభావం Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం – కర్కాటక రాశి ఫలితాలు | Dr. Edupuganti Padmaja Rani చిన్న ఎర్రసాల సర్పంచ్ అభ్యర్థిగా కల్లూరు దశరథ రామిరెడ్డి అమెరికా మార్కెట్లలో మిశ్రమ ముగింపు: టెక్ షేర్లపై ఒత్తిడితో నష్టపోయిన నాస్‌డాక్, స్వల్ప లాభాలతో డౌ జోన్స్ జర్నలిస్టుల పిల్లలకు 100 శాతం ఫీజు రాయితీ కల్పించాలి : పోరుమామిళ్ల టౌన్ వైసిపిపార్టీ సర్పంచ్ అభ్యర్థిగా షేక్ అర్షయా..! సింహరాశిలో గురు అతిచారం | Jupiter’s Accelerated Transit in Leo | మిథున రాశి ఫలితాలు | డా. ఈడ్పుగంటి పద్మజారాణి

పంచాయితీ ఎన్నికలైనా సజావుగా జరిగేనా ?

Select Suryaa Now
పంచాయితీ ఎన్నికలైనా సజావుగా జరిగేనా ?


అనంతపురం రూరల్ మేజర్ న్యూస్ :   అనంతపురం రూరల్ మండల ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల.. నామినేషన్ల ప్రక్రియ నుంచి..  ఓట్ల లెక్కింపు.. ఫలితాల విడుదల వరకు.. అధికార టిడిపి  నాయకులు, కార్యకర్తలు.. అరాచకాలు.. బెదిరింపులు, దాడులు.. దౌర్జన్యాలు.. ఏ మేరకు చోటు చేసుకున్నాయో.... ప్రజలంతా .. మీడియాలో.. పత్రికల్లో  చూశారు. ఇవి మరువక ముందే  పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో గ్రామాలలో రాజకీయం మరోసారి హిటెక్కనుంది.  గ్రామాలలో సర్పంచ్ ఎన్నికలవేళ..  ఎలాంటి హింసాత్మక ఘటనలు... ఘర్షణలు చోటు  చేసుకుంటాయోనన్న భయాందోళన నెలకొన్నాయి.

ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలలో టిడిపి నాయకుల అరాచకాలపై విమర్శలు

అనంతపురం రూరల్ మండలం ఎంపీటీసీ ,జడ్పిటిసి ఎన్నికల నామినేషన్ల సందర్భంగా అనంతపురం రూరల్ మండల పరిషత్ కార్యాలయం సమీపంలో.. తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి.   టిడిపి నాయకులు ,కార్యకర్తలు వందలాదిమంది తరలివచ్చి... ప్రతిపక్ష వైసిపి అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు నామినేషన్లు వేసేందుకు వస్తే అడ్డుకొని.. నామినేషన్ పేపర్లను.. చింపివేసి దాడులు చేసి....  భయాందోళనలు సృష్టించారు. నామినేషన్లు వేసేందుకు.. జనాలతో. వైసీపీ నాయకులు కూడా ర్యాలీగా వస్తే.. వారిని కూడా అడ్డుకొని రాళ్లు విసిరి... దాడులు చేయడంతో.. పలువురు వైసిపి నాయకులకు తీవ్రంగా గాయాలయ్యాయి.   శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీస్ అధికారులు.. అధికార పెద్దలకు వత్తాసు పలుకుతూ... టిడిపి నాయకులు కార్యకర్తలు వందలాది మంది వచ్చినా... పట్టించుకోకుండా.. వైసీపీ అభ్యర్థుల నాయకులు, కార్యకర్తలు.. కనీసం నలుగురు, ఐదు వచ్చినా కూడా అభ్యంతరం తెలిపారు. దీంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయి.. దాడులకు తెగబడ్డారు.   పోలింగ్ రోజు, కౌంటింగ్ రోజు ఎన్నికల ఫలితాలలో కూడా.. ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్లు, పోలీస్ అధికారులు.. అధికార కూటమికి అనుకూలంగా వ్యవహరించారని వైసిపి నాయకులు తీవ్రంగా ఆరోపించారు.

సర్పంచ్ ఎన్నికల్లోనైనా పోలీసులు, ఎన్నికల అధికారులు నిష్పక్షపాతంగా పని చేస్తారా ?


ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో.. అధికార పార్టీకి అనుకూలంగా, ఏకపక్షంగా పనిచేశారన్న..  విమర్శలు పాలైన ఎన్నికల అధికారులు, పోలీసులు.. ప్రస్తుత సర్పంచ్ ఎన్నికలలో...  పారదర్శకంగా పనిచేస్తారా? లేక ఇక్కడ కూడా అధికార ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గి పని చేస్తారాన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  ఎన్నికల అధికారులు, పోలీసులు.. అధికార పార్టీ అనుకూలంగా పనిచేయడం వల్లనే తమ ఓడిపోయామని, ప్రజాస్వామ్య పద్ధతిలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించి ఉంటే.. వైసీపీదే గెలుపు అని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. పోలీసులు, ఎన్నికల అధికారులు తీరు మార్చుకొని.. సర్పంచ్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని ప్రతిపక్ష వైసిపి డిమాండ్ చేస్తుంది.