BREAKING
Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | మకర రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | ధను రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | వృశ్చిక రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | తులా రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | కన్యా రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani హైదరాబాద్‌లో నేడు రాహుల్ గాంధీ ర్యాలీ..గిగ్ వర్కర్లతో ముఖాముఖి Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | సింహ రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani అమెరికాలో విమాన సేవలకు బ్రేక్!కమ్యూనికేషన్ వైఫల్యంతో దేశవ్యాప్త ‘గ్రౌండ్‌స్టాప్’.. అమెరికాలో దేశవ్యాప్త విమాన నిలిపివేత ఎత్తివేత... రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులు: ఏడుగురు మృతి, ఇంధన మరియు పౌర నివాసాలపై తీవ్ర ప్రభావం Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం – కర్కాటక రాశి ఫలితాలు | Dr. Edupuganti Padmaja Rani చిన్న ఎర్రసాల సర్పంచ్ అభ్యర్థిగా కల్లూరు దశరథ రామిరెడ్డి అమెరికా మార్కెట్లలో మిశ్రమ ముగింపు: టెక్ షేర్లపై ఒత్తిడితో నష్టపోయిన నాస్‌డాక్, స్వల్ప లాభాలతో డౌ జోన్స్ జర్నలిస్టుల పిల్లలకు 100 శాతం ఫీజు రాయితీ కల్పించాలి :

సొంత నిధులతో తాగునీటి సమస్యకు పరిష్కారం. నెల రోజులుగా నీటి కోసం గ్రామస్తుల అవస్థలు..

Select Suryaa Now
సొంత నిధులతో తాగునీటి సమస్యకు పరిష్కారం.   నెల రోజులుగా నీటి కోసం గ్రామస్తుల అవస్థలు..

సొంత నిధులతో తాగునీటి సమస్యకు పరిష్కారం.

 

నెల రోజులుగా నీటి కోసం గ్రామస్తుల అవస్థలు..

 

మోటార్ మరమ్మలు చేయించిన రాయవరం నిరంజన్ రెడ్డి.

 

యర్రావారి పాలెం, మేజర్ న్యూస్: యర్రావారి పాలెం మండలం, బోడెవాండ్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని వడ్డేపల్లి గ్రామంలో గత నెల రోజులుగా తాగునీరు లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజువారీ అవసరాలకు కూడా నీరు అందక మహిళలు, చిన్నారులు, వృద్ధులు అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. నీటి సమస్యను పరిష్కరించాలని ఎదురుచూస్తున్న గ్రామస్తులకు ప్రభుత్వ పరంగా సకాలంలో పరిష్కారం లభించక ఇబ్బందులు పడుతూ ఉండేవారు. ఈ విషయం తెలుసుకున్న రాయవరం నిరంజన్ రెడ్డి స్పందించి తన సొంత నిధులతో మోటార్ ఖర్చులు భరించి మోటర్ ను మరమ్మత్తులు చేయించి నీటి సరఫరాకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. దీంతో నెల రోజులుగా నీటి కోసం ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులకు ఉపశమనం లభించింది. ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్న సమయంలో వ్యక్తిగతంగా ముందుకొచ్చి మోటార్ ఖర్చులు భరించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. తమ గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి సహకరించిన నిరంజన్ రెడ్డికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.