నూతన చేయూత పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ
సూర్య మాక్లూర్:మాక్లూర్ మండల కేంద్రంలోని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్‌లో సోమవారం నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులకు పత్రాలను పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. పెన్షన్లు,రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇళ్లు రానివారు నిరుత్సాహ పడకుండా మళ్ళీ అప్లై చేసుకుంటే వచ్చే విధంగా చూస్తానన్నారు. అర్హులైన పేదలకు ప్రభుత్వం సామాజిక భద్రత కల్పించేందుకు పెన్షన్లు అందిస్తోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు,ఉపసర్పంచులు, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఎంపీవో రాజేష్, ప్రజాప్రతినిధులు, నాయకులు, పెన్షన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.