దివ్యాంగులు, వృద్ధులకు ఉచిత సహాయక ఉపకరణాలు
సూర్య సైదాపూర్: హుస్నాబాద్ నియోజకవర్గంలోని దివ్యాంగులు, వయోవృద్ధులకు ఉచితంగా సహాయక ఉపకరణాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అలింకో సంస్థ సహకారంతో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. సోమవారం సైదాపూర్ మండల కేంద్రంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శిబిరాలను ప్రారంభించారు. అర్హులకు కృత్రిమ కాళ్లు, చేతులు, వీల్‌చైర్లు, వినికిడి యంత్రాలు తదితర ఉపకరణాలు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, అలింకో ప్రతినిధులు, అధికారులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.