BREAKING
ఉరేసుకుని యువకుని ఆత్మహత్య శ్రీ సిద్ధి టోంకిని హనుమాన్ 25వ మహా పాదయాత్రకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు దివ్యాంగులు, వృద్ధులకు ఉచిత సహాయక ఉపకరణాలు ది ఒడిస్సీలో రాబర్ట్ ప్యాటిన్సన్ నటనకు బెన్ అఫ్లెక్ ఫిదా.. ఆసక్తికర విశేషాలు పంచుకున్న మ్యాట్ డామన్! ప్రజావాణిలో క్రీడా ప్రాంగణం ఏర్పటు చేయాలని వినతి - గ్రామయువకులు ఎనిమిది సార్లు చేజారిన ఆస్కార్ కల ఎట్టకేలకు నెరవేరింది.. గ్లెన్ క్లోజ్, రిడ్లీ స్కాట్‌లకు గౌరవ ఆస్కార్ పురస్కారాలు! రాచానుపల్లి సర్పంచ్ అభ్యర్థిగా బండ అంజి యాదవ్ నామినేషన్ గాలి బుడగతో నిర్మించిన వింత ఇంటిలో హాలీవుడ్ స్టార్ రాబర్ట్ డౌనీ జూనియర్ నివాసం! ఏకంగా ఒక గ్రామాన్నే కొనేసి విలాసవంతమైన రాజభవనంగా మార్చిన హాలీవుడ్ స్టార్ జానీ డెప్! ఎలిజబెత్ హోమ్స్ సంచలన డాక్యుమెంటరీ యూ క్యాన్ సీ ఎవ్రీథింగ్ భారత్‌లో విడుదలకు సిద్ధం! సమాజంలో పాత్రికేయుల సేవలు వెలకట్టలేనివి మల్కాపూర్‌లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రహరీ గోడల కూల్చివేత శిశు మందిర్ పునర్నిర్మాణానికి కస్తూరి నాగరాజు హర్షం. చెర్లోపల్లి జనసేన పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా బోయ ఎల్లమ్మ డ్రంక్ అండ్ డ్రైవ్‌పై అశ్వారావుపేట పోలీసుల అవగాహన.. తాగి బండి నడిపితే కఠిన చర్యలు

శ్రీ సిద్ధి టోంకిని హనుమాన్ 25వ మహా పాదయాత్రకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు

Select Suryaa Now
శ్రీ సిద్ధి టోంకిని హనుమాన్ 25వ మహా పాదయాత్రకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు

సూర్య సిర్పూర్ (టి) :భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ సిద్ధి టోంకిని హనుమాన్ స్వామివారి 25వ మహా పాదయాత్ర ఈ నెల 17వ తేదీ మంగళవారం నాడు అత్యంత వైభవంగా జరగనుంది.ఈ సందర్భంగా స్వామివారి ఆలయాన్ని బంతి పూలు, మామిడి తోరణాలతో సుందరంగా అలంకరించారు. ఆలయం మొత్తం విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.25 సంవత్సరా లుగా నిర్విరామంగా కొనసాగుతున్న ఈ పాదయాత్రలో పాల్గొనడం తమ జన్మ ధన్యమని భక్తులు చెబుతున్నారు. హనుమాన్ నామస్మరణతో, భజనలతో, కోలాటాలతో పాదయాత్ర మార్గం మొత్తం భక్తి పారవశ్యంతో నిండిపోనుంది. పాదయాత్రకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు లోయ,మారుతి, పవన్,  అన్ని ఏర్పాట్లు చేశారు. వివిధ రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు,భక్తులు పాదయాత్ర కు వచ్చి భక్తులకు తాగునీరు, అన్నదానం, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశారు.స్వామివారిని దర్శించుకున్న భక్తులకు సకల కోరికలు నెరవేరుతాయని, కష్టాలు తొలగిపోతాయని భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. జై హనుమాన్ నినాదాలతో సిర్పూర్ (టి) ప్రాంతమంతా మారుమోగనుంది.జిల్లా పోలీసు శాఖ తో పాటు కౌటల సిఐ ,సిర్పూర్ పోలీస్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.