పెన్షన్ల మంజూరుపై కాంగ్రెస్ శ్రేణుల హర్షం
పెన్షన్ల మంజూరుపై కాంగ్రెస్ శ్రేణుల హర్షం
మంచాల: తెలంగాణ ప్రభుత్వం కొత్తగా పెన్షన్లు మంజూరు చేయడంతో జాపాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తోందని అన్నారు. ఎన్నో రోజులుగా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన కుటుంబాలకు కొత్త పెన్షన్ల మంజూరుతో ఎంతో ఊరట లభించిందని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేతల సత్యం సంజీవ, ప్రధాన కార్యదర్శి పెరుమాండ్ల సంపత్ కుమార్, నోముల కృష్ణ, ఓరుగంటి లింగం గౌడ్, సోప్పరి దశరథ, ఆవుల జగన్, నోముల కుమార్, సింగారం సుమన్, నోముల లింగం, బోల్గం జంగయ్య, ఆవుల జలంధర్, యాట రవి, ఉత్తరపల్లి జంగాచారి, యాట నరసింహ, ఓరుగంటి నాగరాజ్, మంథని పరమేష్ తదితర నాయకులు, కార్యకర్తలు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
✍️ఎర్ర లింగం, మేజర్ న్యూస్, మంచాల, రంగారెడ్డి జిల్లా.