BREAKING
పెన్షన్ల మంజూరుపై కాంగ్రెస్ శ్రేణుల హర్షం క్రీడ పోటీలలో శ్రీకాళహస్తి విద్యార్థులు ప్రతిభ వడ్డే రంగాపురం లో కార్డెన్ సెర్చ్.. 91 ఇళ్లలో సోదాలు, 5 బైకులు సీజ్* శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో భక్తులు రద్దీ. అంతర్జాతీయ స్థాయి ఆతిథ్య సేవలతో మినర్వా గ్రాండ్ ప్రారంభం పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా వై. నాగిరెడ్డి బాధ్యతల స్వీకరణ యువతను మాదకద్రవ్యాల నుంచి దూరం చేయాలి.. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పిలుపు ఈ నెల 30న నగరంలో ఆటోల బందు గెలుపులో ముందంజ.. పదవిలో వెనుకంజ..! అరవపాలెం ఆశలకు అండ లభించేనా..! తెలుగుదేశం కంచుకోటగా నిలిపారు.. గుర్తింపు ఎప్పుడు ఇస్తారు..! నల్లారెడ్డి కుటుంబానికి న్యాయం జరిగేనా..! పార్టీ కోసం ప్రస్థానం.. పదవి కోసం ఎదురుచూపులు..! మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవిపై స్థానికుల ఆశలు.నిర్ణయంపై ఆసక్తి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ రంగంలో.. యూనికార్న్ హోటను సాధించిన 'స్టార్క్ ఫ్యూచర్' ఏపీకి పొంచి ఉన్న అతి తీవ్ర తుఫాన్ ముప్పు.. 'అక్వాన్'గా నామకరణం హలో నేతకాని --చలో ఉస్మానియా నవంబర్ 19న ప్రారంభం కానున్న మహానది కోల్‌ఫీల్డ్స్ ఐపీఓ పోట్లమర్రి పంచాయతీ సర్పంచ్ బరిలో నెట్టెం శకుంతలమ్మ జోరు.. భారీ వాహనాల ర్యాలీతో నామినేషన్ దాఖలు! బిహార్ సీఎం సమ్రాట్ చౌదరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

అంతర్జాతీయ స్థాయి ఆతిథ్య సేవలతో మినర్వా గ్రాండ్ ప్రారంభం

Select Suryaa Now
అంతర్జాతీయ స్థాయి ఆతిథ్య సేవలతో  మినర్వా గ్రాండ్ ప్రారంభం
తెలంగాణ బ్యూరో, ప్రతినిధి: నగర ఆతిథ్య రంగంలో మరో ప్రతిష్ఠాత్మక హోటల్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఆతిథ్య సంస్థ మినర్వా గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినర్వా గ్రాండ్ హోటల్ ప్రీ-లాంచ్ ప్రారంభోత్సవ వేడుక హనుమకొండలోని ఎంకేఆర్ సిటీ సెంటర్‌లో ఘనంగా నిర్వహించారు. అత్యాధునిక సౌకర్యాలు, విలాసవంతమైన వసతి, నాణ్యమైన ఆహార సేవలు, ప్రత్యేక వేడుకల నిర్వహణకు అవసరమైన అన్ని వసతులతో రూపుదిద్దుకున్న ఈ హోటల్ ప్రారంభోత్సవానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మినర్వా గ్రాండ్ యజమానులు మల్లారెడ్డి ఆలుమల్ల, కుందూరు కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో పాటు నగరానికి చెందిన ప్రముఖులు, వ్యాపారవేత్తలు, వివిధ రంగాల ప్రతినిధులు, శ్రేయోభిలాషులు, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొని హోటల్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన హోటల్‌లో ఏర్పాటు చేసిన వసతి, రెస్టారెంట్లు, ఇతర సౌకర్యాలను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా నిర్వాహకుడు మల్లారెడ్డి ఆలుమల్ల మాట్లాడుతూ.. హనుమకొండ, వరంగల్ ప్రాంతాల్లో పెరుగుతున్న ఆతిథ్య సేవల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అంతర్జాతీయ ప్రమాణాలతో మినర్వా గ్రాండ్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. అతిథులకు నాణ్యమైన ఆహారం, సౌకర్యవంతమైన వసతి, ఆహ్లాదకరమైన వాతావరణం, మర్యాదపూర్వకమైన సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కుటుంబ సమేతంగా భోజనం చేయాలనుకునే వారి నుంచి వ్యాపార సమావేశాలు, వివాహాలు, ఇతర శుభకార్యాలు నిర్వహించుకునే వారి వరకు అందరికీ అనువైన వేదికగా మినర్వా గ్రాండ్ నిలుస్తుందని చెప్పారు. హనుమకొండ, వరంగల్ ప్రజలకు మినర్వా బ్రాండ్ ఆతిథ్య సేవలను చేరువ చేయడం సంతోషంగా ఉందన్నారు.