శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో భక్తులు రద్దీ.
కార్తీక సోమవారం శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు రద్దీ. ఈఓ బి.కె. వెంకటేశులు
శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక సోమవారం సందర్భంగా స్వామి దర్శనార్థం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి బికె. వెంకటేశులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు దగ్గరుండి పర్యవేక్షిస్తూ, క్యూలైన్లలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు సజావుగా స్వామివారి దర్శనం కల్పించేలా ఆలయ అధికారులకు, సిబ్బందికి తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత తదితర భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
కార్తీక మాస పవిత్రతను పురస్కరించుకుని ఆలయానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ప్రశాంతమైన, సౌకర్యవంతమైన స్వామివారి దర్శనం కల్పించడమే దేవస్థానం ప్రధాన లక్ష్యమని ఈఓ బికె. వెంకటేశులు పేర్కొన్నారు. వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి