BREAKING
పర్యాటక కేంద్రం పాటోంగ్ సమీపంలో తెల్లవారుజామున విషాదం పెన్షన్ల మంజూరుపై కాంగ్రెస్ శ్రేణుల హర్షం క్రీడ పోటీలలో శ్రీకాళహస్తి విద్యార్థులు ప్రతిభ వడ్డే రంగాపురం లో కార్డెన్ సెర్చ్.. 91 ఇళ్లలో సోదాలు, 5 బైకులు సీజ్* శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో భక్తులు రద్దీ. అంతర్జాతీయ స్థాయి ఆతిథ్య సేవలతో మినర్వా గ్రాండ్ ప్రారంభం పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా వై. నాగిరెడ్డి బాధ్యతల స్వీకరణ యువతను మాదకద్రవ్యాల నుంచి దూరం చేయాలి.. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పిలుపు ఈ నెల 30న నగరంలో ఆటోల బందు గెలుపులో ముందంజ.. పదవిలో వెనుకంజ..! అరవపాలెం ఆశలకు అండ లభించేనా..! తెలుగుదేశం కంచుకోటగా నిలిపారు.. గుర్తింపు ఎప్పుడు ఇస్తారు..! నల్లారెడ్డి కుటుంబానికి న్యాయం జరిగేనా..! పార్టీ కోసం ప్రస్థానం.. పదవి కోసం ఎదురుచూపులు..! మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవిపై స్థానికుల ఆశలు.నిర్ణయంపై ఆసక్తి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ రంగంలో.. యూనికార్న్ హోటను సాధించిన 'స్టార్క్ ఫ్యూచర్' ఏపీకి పొంచి ఉన్న అతి తీవ్ర తుఫాన్ ముప్పు.. 'అక్వాన్'గా నామకరణం హలో నేతకాని --చలో ఉస్మానియా నవంబర్ 19న ప్రారంభం కానున్న మహానది కోల్‌ఫీల్డ్స్ ఐపీఓ పోట్లమర్రి పంచాయతీ సర్పంచ్ బరిలో నెట్టెం శకుంతలమ్మ జోరు.. భారీ వాహనాల ర్యాలీతో నామినేషన్ దాఖలు!

వడ్డే రంగాపురం లో కార్డెన్ సెర్చ్.. 91 ఇళ్లలో సోదాలు, 5 బైకులు సీజ్*

Select Suryaa Now
వడ్డే రంగాపురం లో కార్డెన్ సెర్చ్.. 91 ఇళ్లలో సోదాలు, 5 బైకులు సీజ్*

*సూర్య అశ్వారావుపేట :* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ శ్రీ రోహిత్ రాజు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, పాల్వంచ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి సతీష్ కుమార్ గారి సూచనలతో అశ్వారావుపేట పోలీసులు వడ్డెరంగాపురం గ్రామంలో కార్డెన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని మొత్తం 91 ఇళ్లను పోలీసులు క్షుణ్ణంగా సోదా చేశారు. అలాగే గ్రామంలో ఉన్న 83 ద్విచక్ర వాహనాలు, 11 ఆటోలు, 6 ట్రాక్టర్ల పత్రాలను పరిశీలించారు.

పత్రాలు సరిగా లేని 15 ద్విచక్ర వాహనాలపై చలాన్లు విధించి, అక్కడికక్కడే జరిమానాలు వసూలు చేశారు. సరైన ధ్రువపత్రాలు చూపించని 5 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు.

*సంక్రాంతికి కోడిపందాలు, పేకాటపై హెచ్చరిక*

రాబోయే సంక్రాంతి పండుగ, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గ్రామంలో ఎవరైనా కోడిపందాలు, పేకాట వంటి జూద శిబిరాలు నిర్వహించినా, వాటిలో పాల్గొన్నా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు గ్రామస్తులను హెచ్చరించారు.

అదేవిధంగా గంజాయి రవాణా, వాడకం, సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. మైనర్ డ్రైవింగ్ చేయకుండా ఉండేందుకు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు.

అశ్వారావుపేట మండలంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా, ముఖ్యంగా గంజాయి రవాణా, వాడకాన్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు ఇలాగే అన్ని గ్రామాల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తూ, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట సీఐ నాగరాజు రెడ్డి, ఎస్‌హెచ్‌వో సాయి కిషోర్ రెడ్డి, అదనపు ఎస్ఐ దేవ్ సింగ్, దమ్మపేట అదనపు ఎస్ఐ బాలస్వామి, అశ్వారావుపేట సర్కిల్ పోలీస్ సిబ్బంది, వడ్డెరంగాపురం సర్పంచ్ పాల్గొన్నారు.

సూర్య రిపోర్టర్ మునీర్ ఆర్ సి అశ్వారావుపేట