BREAKING
శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో భక్తులు రద్దీ. అంతర్జాతీయ స్థాయి ఆతిథ్య సేవలతో మినర్వా గ్రాండ్ ప్రారంభం పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా వై. నాగిరెడ్డి బాధ్యతల స్వీకరణ యువతను మాదకద్రవ్యాల నుంచి దూరం చేయాలి.. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పిలుపు ఈ నెల 30న నగరంలో ఆటోల బందు గెలుపులో ముందంజ.. పదవిలో వెనుకంజ..! అరవపాలెం ఆశలకు అండ లభించేనా..! తెలుగుదేశం కంచుకోటగా నిలిపారు.. గుర్తింపు ఎప్పుడు ఇస్తారు..! నల్లారెడ్డి కుటుంబానికి న్యాయం జరిగేనా..! పార్టీ కోసం ప్రస్థానం.. పదవి కోసం ఎదురుచూపులు..! మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవిపై స్థానికుల ఆశలు.నిర్ణయంపై ఆసక్తి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ రంగంలో.. యూనికార్న్ హోటను సాధించిన 'స్టార్క్ ఫ్యూచర్' ఏపీకి పొంచి ఉన్న అతి తీవ్ర తుఫాన్ ముప్పు.. 'అక్వాన్'గా నామకరణం హలో నేతకాని --చలో ఉస్మానియా నవంబర్ 19న ప్రారంభం కానున్న మహానది కోల్‌ఫీల్డ్స్ ఐపీఓ పోట్లమర్రి పంచాయతీ సర్పంచ్ బరిలో నెట్టెం శకుంతలమ్మ జోరు.. భారీ వాహనాల ర్యాలీతో నామినేషన్ దాఖలు! బిహార్ సీఎం సమ్రాట్ చౌదరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 15 గంటల సమయం యూరోపియన్ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు.. అంతర్జాతీయ టెక్ ఒత్తిళ్ల మధ్య ట్రేడింగ్ కార్తీక సోమవారం.. కొనగట్టు శివాలయానికి పోటెత్తిన భక్తులు!

పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా వై. నాగిరెడ్డి బాధ్యతల స్వీకరణ

Select Suryaa Now
పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా వై. నాగిరెడ్డి బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వైస్‌ ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, తూనికలు కొలతల శాఖ కంట్రోలర్‌గా వై. నాగిరెడ్డి, ఐపీఎస్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగేలా చూడటమే తన ప్రథమ ప్రాధాన్యమని తెలిపారు. 

రైతులకు సకాలంలో చెల్లింపులు, కొనుగోలు చేసిన ధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించడం, సరైన తూకాలు, పారదర్శకమైన రికార్డుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.కస్టమ్ మిల్లింగ్‌లో భాగంగా మిల్లులకు కేటాయించిన ధాన్యం ప్రభుత్వ ఆస్తి అని, ప్రతి గింజకు లెక్క ఉండాలని స్పష్టం చేశారు. మిల్లుల వారీగా బకాయిలపై సమీక్ష నిర్వహిస్తామని, ధాన్యాన్ని పక్కదారి పట్టించినా, తప్పుడు లెక్కలు చూపినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు పాటించే మిల్లర్లను ప్రోత్సహిస్తామని చెప్పారు.
ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేసి అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. రేషన్ కార్డుల్లో తప్పుల సవరణ, కొత్త దరఖాస్తుల పరిష్కారం, నిత్యావసర సరుకుల అక్రమ తరలింపును అరికట్టడంపై దృష్టి పెడతామని తెలిపారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌లో ఆర్థిక క్రమశిక్షణ, కొనుగోళ్లు, నిల్వలు, రవాణా, పంపిణీ వ్యవస్థలను సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. నిత్యావసర సరుకుల ధరలు, లభ్యతను పర్యవేక్షిస్తూ బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
తూనికలు కొలతల శాఖ ద్వారా వినియోగదారులకు సరైన పరిమాణంలో సరుకులు అందేలా చూస్తామని, పెట్రోల్ బంకులు, ప్యాకేజ్డ్ వస్తువుల విక్రయాల్లో కొలతల మోసాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిజాయితీగా పనిచేసే అధికారులకు అండగా ఉంటామని, నిర్లక్ష్యం, తప్పుడు నివేదికలు, విధుల పట్ల అలసత్వాన్ని సహించబోమని స్పష్టం చేశారు. రైతులు, రేషన్ కార్డుదారులు, వినియోగదారుల ప్రయోజనాలే లక్ష్యంగా పారదర్శకత, జవాబుదారీతనం, సకాలంలో సేవలందించే విధంగా శాఖను ముందుకు తీసుకెళ్తామని వై. నాగిరెడ్డి పేర్కొన్నారు.