BREAKING
శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో భక్తులు రద్దీ. అంతర్జాతీయ స్థాయి ఆతిథ్య సేవలతో మినర్వా గ్రాండ్ ప్రారంభం పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా వై. నాగిరెడ్డి బాధ్యతల స్వీకరణ యువతను మాదకద్రవ్యాల నుంచి దూరం చేయాలి.. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పిలుపు ఈ నెల 30న నగరంలో ఆటోల బందు గెలుపులో ముందంజ.. పదవిలో వెనుకంజ..! అరవపాలెం ఆశలకు అండ లభించేనా..! తెలుగుదేశం కంచుకోటగా నిలిపారు.. గుర్తింపు ఎప్పుడు ఇస్తారు..! నల్లారెడ్డి కుటుంబానికి న్యాయం జరిగేనా..! పార్టీ కోసం ప్రస్థానం.. పదవి కోసం ఎదురుచూపులు..! మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవిపై స్థానికుల ఆశలు.నిర్ణయంపై ఆసక్తి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ రంగంలో.. యూనికార్న్ హోటను సాధించిన 'స్టార్క్ ఫ్యూచర్' ఏపీకి పొంచి ఉన్న అతి తీవ్ర తుఫాన్ ముప్పు.. 'అక్వాన్'గా నామకరణం హలో నేతకాని --చలో ఉస్మానియా నవంబర్ 19న ప్రారంభం కానున్న మహానది కోల్‌ఫీల్డ్స్ ఐపీఓ పోట్లమర్రి పంచాయతీ సర్పంచ్ బరిలో నెట్టెం శకుంతలమ్మ జోరు.. భారీ వాహనాల ర్యాలీతో నామినేషన్ దాఖలు! బిహార్ సీఎం సమ్రాట్ చౌదరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 15 గంటల సమయం యూరోపియన్ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు.. అంతర్జాతీయ టెక్ ఒత్తిళ్ల మధ్య ట్రేడింగ్ కార్తీక సోమవారం.. కొనగట్టు శివాలయానికి పోటెత్తిన భక్తులు!

యువతను మాదకద్రవ్యాల నుంచి దూరం చేయాలి.. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పిలుపు

Select Suryaa Now
యువతను మాదకద్రవ్యాల నుంచి దూరం చేయాలి.. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పిలుపు

హైదరాబాద్, మేజర్ న్యూస్ ప్రతినిధి : మాదకద్రవ్య రహిత తెలంగాణ నిర్మాణంతో పాటు వికసిత్ భారత్-2047 లక్ష్య సాధనలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, యువత క్రియాశీలక పాత్ర పోషించాలని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. శనివారం లోక్‌భవన్‌లో రెడ్‌క్రాస్ నూతన రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం 29 జిల్లాల చైర్మన్లతో ఆయన సమావేశమయ్యారు.

కేవలం మూడున్నర నెలల్లో 68 వేల మంది కొత్త సభ్యులను చేర్చినందుకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిశోర్, జిల్లా ప్రతినిధులను గవర్నర్ అభినందించారు. నవంబర్ 14 నుంచి డిసెంబర్ 31 వరకు విద్యాసంస్థల్లో జూనియర్, యూత్ రెడ్‌క్రాస్ సభ్యత్వాలను విస్తృతం చేయాలని సూచించారు. ఈగల్ ఫోర్స్, స్వచ్ఛంద సంస్థల సహకారంతో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై ర్యాలీలు, పోటీల ద్వారా యువతలో అవగాహన కల్పించాలని కోరారు.
ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే విపత్తులను ఎదుర్కొనేందుకు జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి, 2,078 మంది ఆపద మిత్ర వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. సేవా కార్యక్రమా ల్లో ప్రతిభ చూపిన విద్యాసంస్థలకు వచ్చే ఏడాది జనవరి 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా 'రెడ్‌క్రాస్-లోక్‌భవన్ వివేకానంద యూత్ అవార్డులు' అందజేయనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో గవర్నర్ సంయుక్త కార్యదర్శి కోమండూర్ శశికిరణ్, రెడ్‌క్రాస్ సీఈఓ ఎ. శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు