BREAKING
పెన్షన్ల మంజూరుపై కాంగ్రెస్ శ్రేణుల హర్షం ఇండో కౌంట్ షేర్లకు 'బై' రేటింగ్: 31% అప్‌సైడ్ అంచనా వేసిన డోలట్ క్యాపిటల్! హైదరాబాద్‌లో 'డిజిటల్ అరెస్ట్' కలకలం.. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగినికి రూ. 1.42 కోట్ల టోకరా Q2 ఫలితాల జోరు: మోతీలాల్ ఓస్వాల్ 25 టాప్ స్టాక్ పిక్స్! అల్లూరు నగర పంచాయతీ ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ.. ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాని వైనం! వినాయక స్వామి కుంభాభిషేకం లో పాల్గొన్న ఎమ్మెల్యే అమర్నాథ రెడ్డి వినాయక స్వామి కుంభాభిషేకం లో పాల్గొన్న ఎమ్మెల్యే అమర్నాథ రెడ్డి ప్రజావాణికి రెవెన్యూ శాఖకు సంబంధించి ఒక దరఖాస్తు భీమన్న విగ్రహ ప్రతిష్ఠాపనకు ఎమ్మెల్యేకు ఆహ్వానం - రూ.51 వేల విరాళం అందజేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వైఎస్ఆర్సిపి లో 50 కుటుంబాలు చేరిక గ్రౌండ్ లెవెలింగ్ పనులు దాదాపు పూర్తి.. పలుమార్లు వాటరింగ్ చేయాలని కలెక్టర్ ఆదేశం ఉరేసుకుని యువకుని ఆత్మహత్య శ్రీ సిద్ధి టోంకిని హనుమాన్ 25వ మహా పాదయాత్రకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు దివ్యాంగులు, వృద్ధులకు ఉచిత సహాయక ఉపకరణాలు ది ఒడిస్సీలో రాబర్ట్ ప్యాటిన్సన్ నటనకు బెన్ అఫ్లెక్ ఫిదా.. ఆసక్తికర విశేషాలు పంచుకున్న మ్యాట్ డామన్!

వినాయక స్వామి కుంభాభిషేకం లో పాల్గొన్న ఎమ్మెల్యే అమర్నాథ రెడ్డి

Select Suryaa Now
వినాయక స్వామి కుంభాభిషేకం లో పాల్గొన్న ఎమ్మెల్యే అమర్నాథ రెడ్డి

గంగవరం మండలం కల్లుపల్లి పంచాయతీ పరిధిలోని మిట్టూరు గ్రామంలో కొలువుదీరిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థాన మహా కుంభాభిషేక మహోత్సవం సోమవారం భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకకు పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
మహోత్సవంలో భాగంగా ఆలయంలో శాస్త్రోక్తంగా కలశారాధన, నిత్య హోమం, ప్రాణప్రతిష్ఠ హోమం, కలశోద్ధాసన తదితర వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం స్వామివారి ప్రాణప్రతిష్ఠ, మహా కుంభాభిషేక సంప్రోక్షణ, మహా మంగళహారతి కార్యక్రమాలు అర్చకుల వేదమంత్రోచ్ఛారణల నడుమ అత్యంత వైభవంగా జరిగాయి. ఎమ్మెల్యే అమర్నాథ రెడ్డి ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక ప్రార్థనలు సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసేలా మహా కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు.
అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్థులు ఎమ్మెల్యే అమర్నాథ రెడ్డిని ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, సోమశేఖర్ గౌడ్, ప్రతాప్ రెడ్డి, రామ్మోహన్, సతీష్, భరత్, సురేష్, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.