BREAKING
భారత్‌కు చేరుకున్న ప్రిన్స్ విలియం దంపతులు: ప్రధాని మోదీతో భేటీ! సన్నీ డియోల్ సూర్య చిత్రానికి చిక్కులు.. విడుదల జనవరికి వాయిదా? అమెరికాలో నటుడు కాదంబరి కిరణ్ కుమార్తె కృతి సీమంతం వేడుక.. ఫొటోలు వైరల్! కలెక్టర్ ఆదేశాలను పట్టించుకోని అధికారులు రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. పెద్ద కుమారుడు శశాంక్ నిశ్చితార్థం ఖరారు! బడ్జెట్ 2027: ఆర్థికవేత్తలతో నిర్మలా సీతారామన్ ప్రీ-బడ్జెట్ భేటీ! వీఎఫ్ఎక్స్ బాగోలేదని తిడుతున్నారు.. రెండు నెలల ముందే సినిమా పూర్తి చేయండి: నాగార్జున కీలక సూచన! నూతనంగా మంజూరైన పెన్షన్ల పంపిణీ... కోల్స్ ఆనందపురం గ్రామంలో విషాదం.. బాధిత కుటుంబానికి ఆర్థిక చేయూత మానవత్వంతో కుటుంబాన్ని పరామర్శించిన టేకూరి నాగేశ్వరరావు ఇంధన ధరల సెగ: 12.29 శాతానికి చేరిన టోకు ద్రవ్యోల్బణం! సంగీత ప్రయాణంలో పదిహేనేళ్లు.. అభిమానులకు అనిరుధ్ రవిచందర్ భావోద్వేగ పోస్ట్! ఎన్నికల నేపథ్యంలో వాహనాల తనిఖీలు హిందూపురం ఇందిరా పార్క్ లో నూతన పనులకు శ్రీకారం ఏఐ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి చిరంజీవి వినతి! కుప్పకూలిన వెండి ధర: రూ. 1.75 లక్షల దిగువకు పతనం!

కోల్స్ ఆనందపురం గ్రామంలో విషాదం.. బాధిత కుటుంబానికి ఆర్థిక చేయూత మానవత్వంతో కుటుంబాన్ని పరామర్శించిన టేకూరి నాగేశ్వరరావు

Select Suryaa Now
కోల్స్ ఆనందపురం గ్రామంలో విషాదం.. బాధిత కుటుంబానికి ఆర్థిక చేయూత  మానవత్వంతో కుటుంబాన్ని పరామర్శించిన  టేకూరి నాగేశ్వరరావు

 

పాములపాడు మండలం కోల్స్ ఆనందపురం గ్రామానికి చెందిన శ్రీ సుధాకర్ కుమార్తె కురుపమ్మ చిన్న వయస్సులోనే అకాల మరణం చెందడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషాద వార్త తెలుసుకున్న జూటూరు గ్రామ ఎం.పీ.టీ.సీ టేకూరి రామసుబ్బమ్మ తనయుడు టేకూరి నాగేశ్వరరావు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

ఈ సందర్భంగా మృతురాలి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, వారి బాధలో తాము కూడా పాలుపంచుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం బాధిత కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

అంతేకాకుండా భవిష్యత్తులోనూ ఆ కుటుంబానికి అవసరమైన సమయంలో అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కష్టకాలంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించడం పట్ల గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ కష్టాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని పలువురు ప్రార్థించారు.