ఎన్నికల నేపథ్యంలో వాహనాల తనిఖీలు
గుర్ల, మేజర్ న్యూస్:
సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో గుర్లలో ఎస్సై నారాయణరావు ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు సోమవారం నిర్వహించారు. ఎన్నికల సమయంలో అక్రమ నగదు, మద్యం తరలింపును అరికట్టేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు చేపట్టారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు పోలీసు శాఖ అప్రమత్తంగా ఉందని ఎస్సై నారాయణరావు తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, తనిఖీలకు సహకరించాలని సూచించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.