మెడికల్ కాలేజీ అభివృద్ధికి రూ.24.40 కోట్లు మంజూరు - ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి:కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ తెలిపారు. కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.24 కోట్ల 40 లక్షల నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన తెలిపారు. అలాగే తెలంగాణ పబ్లిక్ స్కూల్ కొరకు రూ.10 కోట్లు మంజూరు అయ్యాయని వెల్లడించారు. మెడికల్ కాలేజీలో చేపట్టనున్న అభివృద్ధి పనులు, అదనపు మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన నిధుల వివరాలను ఆయన సోమవారం కాలేజీ ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్ 175, హెచ్ ఎం & ఎఫ్ డబ్ల్యూ(C2) ద్వారా ఈ నిధులను మంజూరు చేసిందని తెలిపారు. మెడికల్ కాలేజీ భవనాలు, బాలుర, బాలికల వసతి గృహాలు, వంటశాల, డైనింగ్ హాల్, ప్రిన్సిపల్ క్వార్టర్స్, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, విద్యుత్, రహదారులు, డ్రైనేజీ, కాంపౌండ్ వాల్ తదితర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ నిధులను వినియోగించనున్నట్లు వివరించారు. కామారెడ్డి మెడికల్ కాలేజీ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని, వైద్య విద్యను బలోపేతం చేయడంతో పాటు సామాన్య, పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. రూ.24.40 కోట్ల నిధుల పనుల వివరాలుసివిల్ వర్క్స్ మెడికల్ కాలేజీ, బాలుర మరియు బాలికల హాస్టళ్లు, కిచెన్, డైనింగ్ హాల్, ప్రిన్సిపల్ క్వార్టర్స్‌కు సంబంధించిన సివిల్ పనులకు రూ.84 లక్షల 96 వేలు కేటాయించారు. వాటర్ సప్లై, శానిటరీ పనులుమెడికల్ కాలేజీ, బాలుర, బాలికల హాస్టళ్లు, కిచెన్, డైనింగ్ హాల్, ప్రిన్సిపల్ క్వార్టర్స్‌లో నీటి సరఫరా, పారిశుద్ధ్య సదుపాయాల కోసం రూ.21 లక్షల 57 వేలు కేటాయించారు. రోడ్లు, డ్రైనేజీ, ఇతర మౌలిక సదుపాయాలు MCW రోడ్లు, వాటర్ డ్రైనేజీ, సంపు, మిషన్ భగీరథ కనెక్షన్, 33 కేవీ విద్యుత్ లైన్ షిఫ్టింగ్, 700 ఆర్ఎంటీ కాంపౌండ్ వాల్, బీటీ రోడ్డు నిర్మాణం తదితర పనులకు రూ.1 కోటి 10 లక్షలు కేటాయించారు. ఎలక్ట్రిఫికేషన్, ఎలక్ట్రో మెకానికల్ సర్వీసెస్ విద్యుత్ సదుపాయాలు, ఎలక్ట్రికల్, మెకానికల్ సంబంధిత పనులకు రూ.17 లక్షల 78 వేలు కేటాయించారు. LS ప్రొవిజన్స్ సివిల్ వర్క్స్అదనపు సివిల్ పనుల కోసం రూ.1 కోటి 9 లక్షలు కేటాయించారు. సివిల్ వర్క్స్, వాటర్ సప్లై, శానిటరీ పనులకు రూ.1 కోటి 10 లక్షలు కేటాయించారు. లిఫ్ట్ సదుపాయాలు మెడికల్ కాలేజీలో రెండు లిఫ్టుల ఏర్పాటు సహా వివిధ అదనపు అభివృద్ధి పనులను కూడా ఈ నిధులతో చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు కామారెడ్డి ప్రజల తరఫున, మెడికల్ కాలేజీ విద్యార్థులు, అధ్యాపకులు, వైద్య సిబ్బంది తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. కామారెడ్డి మెడికల్ కాలేజీ రాష్ట్రంలోనే గుర్తింపు పొందిన వైద్య విద్యా సంస్థగా ఎదుగుతోందని, దీనికి అదనంగా 32 పీజీ సీట్లు మంజూరు కావడం ఎంతో సంతోషకరమైన విషయమని షబ్బీర్ అలీ అన్నారు. పీజీ సీట్ల మంజూరుతో వైద్య విద్యలో ఉన్నత చదువులకు మరిన్ని అవకాశాలు లభించడంతో పాటు, భవిష్యత్తులో నిపుణులైన వైద్యులను తయారు చేయడానికి ఈ కాలేజీ వేదికగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
నాణ్యమైన విద్యతో పాటు మంచి భోజనం అందించాలి.. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, బోధనా సిబ్బంది, సంబంధిత అధికారులకు షబ్బీర్ అలీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు కేవలం నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా, వారి ఆరోగ్యం, సంక్షేమం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన, పోషక విలువలతో కూడిన భోజనం అందించాలని కోరారు. ఈరోజు మనం విద్యార్థులకు అందించే విద్య, సదుపాయాలు, మంచి భోజనం వారి భవిష్యత్తుకు పునాది అవుతాయన్నారు. ఇక్కడ చదువుకునే విద్యార్థులు రేపు దేశానికి సేవ చేసే వైద్యులుగా ఎదగాలని, పేద ప్రజలకు అండగా నిలిచే నిబద్ధత కలిగిన వైద్యులుగా వారు తయారవ్వాలన్నారు. అందుకు కాలేజీ యాజమాన్యం, బోధనా సిబ్బంది సమష్టిగా కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు.నాణ్యమైన విద్యతో పాటు మంచి భోజనం అందించాలి..ఈ సందర్భంగా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, బోధనా సిబ్బంది, సంబంధిత అధికారులకు షబ్బీర్ అలీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు కేవలం నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా, వారి ఆరోగ్యం, సంక్షేమం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన, పోషక విలువలతో కూడిన భోజనం అందించాలని కోరారు. ఈరోజు మనం విద్యార్థులకు అందించే విద్య, సదుపాయాలు, మంచి భోజనం వారి భవిష్యత్తుకు పునాది అవుతాయన్నారు. ఇక్కడ చదువుకునే విద్యార్థులు రేపు దేశానికి సేవ చేసే వైద్యులుగా ఎదగాలని, పేద ప్రజలకు అండగా నిలిచే నిబద్ధత కలిగిన వైద్యులుగా వారు తయారవ్వాలన్నారు. అందుకు కాలేజీ యాజమాన్యం, బోధనా సిబ్బంది సమష్టిగా కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు.
త్వరలో క్రిటికల్ కేర్ సెంటర్, హాస్పిటల్ ప్రారంభం మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ప్రారంభం కానుంది.కామారెడ్డి వైద్య రంగ అభివృద్ధికి మరో ముందడుగుగా త్వరలోనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ద్వారా క్రిటికల్ కేర్ సెంటర్, మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్‌ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని షబ్బీర్ అలీ వెల్లడించారు. ఈ రెండు వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తే అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు మెరుగైన చికిత్స అందించడంతో పాటు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ముఖ్యంగా పేద కుటుంబాలు అత్యవసర వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని పేర్కొన్నారు.కామారెడ్డి మెడికల్ కాలేజీని మరింత అభివృద్ధి చేసి, అన్ని రకాల వైద్య సేవలు అందించే స్థాయికి తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానని, కాలేజీ అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ ఇలియాస్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఐరేనీ సందీప్, గూడెం శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రామ్మోహన్, మాజీద్, వాజిద్, భూపతి, అంజద్, నీట్టు వెంకట్రావు, గంప ప్రసాద్, ఉరుదొండ ప్రవీణ్, సంతోష్ రావు, భరత్ టింకు తదితరులు పాల్గొన్నారు.