నామినేషన్ కేంద్రాలు పరిశీలన
మెలియాపుట్టి. నవంబర్ 16. మేజర్ న్యూస్....
ఎన్నికల నేపథ్యంలో మండలంలోని 10వ క్లస్టర్ పరిధిలో ఉన్న నామినేషన్ కేంద్రాలను ఎంపీడీవో పి. నరసింహ ప్రసాద్ మంగళవారం పరిశీలించారు. మెలియాపుట్టి(మ)మర్రిపాడు-సి, పెద్దలక్ష్మీపురం, గొప్పిలి, మెలియాపుట్టి, కోసమాల, పెద్ద పద్మాపురం తదితర గ్రామాల్లో కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. నామినేషన్ల స్వీకరణకు అవసరమైన సదుపాయాలు, ఏర్పాట్లపై సిబ్బందికి సూచనలు చేశారు. ఆయన వెంట డిప్యూటీ ఎంపీడీవో అప్పయ్య, ఎంఈవో పద్మనాభరావు, పంచాయతీ కార్యదర్శులు శివాజీ, మోహన్‌రావు తదితరులు ఉన్నారు.
అనపాన నాగిరెడ్డి...... మెలియాపుట్టి...