జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. :టీయూడబ్ల్యూజే–ఐజేయూ నాయకుల విజ్ఞప్తి. :
1. సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి:
ఈ నెల 25న నిర్మల్‌లో నిర్వహించనున్న టీయూడబ్ల్యూజే–ఐజేయూ జిల్లా మహాసభలకు కాంగ్రెస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీహరిరావును యూనియన్ నాయకులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆర్థిక, నివాస సమస్యలతో ఇబ్బందులు పడుతున్న అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. మహాసభల్లో జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కొండూరు రవీందర్, ప్రధాన కార్యదర్శి వెంకగారి భూమయ్య, కోశాధికారి ప్రశాంత్, ఉపాధ్యక్షులు గుమ్ముల అశోక్, వేణుగోపాల్, కార్యదర్శులు మనోజ్, హనుమాన్లు, ప్రసాద్, రాజన్న, ఉమేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.