BREAKING
హిందూపురం మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి ముస్లిం సామాజిక వర్గానికి కేటాయించాలి.. మెడికల్ కాలేజీ అభివృద్ధికి రూ.24.40 కోట్లు మంజూరు - ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నామినేషన్ కేంద్రాలు పరిశీలన ప్రజావాణికి మూడు దరఖాస్తులు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. :టీయూడబ్ల్యూజే–ఐజేయూ నాయకుల విజ్ఞప్తి. : తీవ్ర వాయుగుండంపై సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష వివాహనికి హాజరైన బీఆర్ఎస్ నాయకులు* మీడియా రంగంలో చెరగని ముద్ర వేసిన అక్షర యోధుడు రామోజీరావు ఏజెంట్ల మాయమాటలకు బలి.. మలేషియా జైల్లో తెలుగు బిడ్డల నరకయాతన - వైసీపీ నేతల అవినీతి అక్రమాలపై వెబ్ సిరీస్ తీస్తే దానికి అంతం ఉండదు మంత్రి కొల్లు రవీంద్ర కార్తీక వనంలో మైత్రి పరిమళం...! పదో తరగతి పబ్లిక్ పరీక్షలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్ ప్రవేశాలను ప్రోత్సహించాలి: అసిస్టెంట్ కమిషనర్ లాజరు... ఇవాళ తుఫాన్‌గా బలపడనున్న వాయుగుండం! ..19న మచిలీపట్నం సమీపంలో తీరం దాటే ఛాన్స్.. గంటకు 145 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు కోటి సోమవారం వేళ శోభాయమానంగా ‘శ్రీగిరి గిరిప్రదక్షిణ’ సింగరాయకొండ కూటమి సర్పంచ్ అభ్యర్ధి సంధాని భాష నామినేషన్‌

- వైసీపీ నేతల అవినీతి అక్రమాలపై వెబ్ సిరీస్ తీస్తే దానికి అంతం ఉండదు మంత్రి కొల్లు రవీంద్ర

Select Suryaa Now
- వైసీపీ నేతల అవినీతి అక్రమాలపై వెబ్ సిరీస్ తీస్తే దానికి అంతం ఉండదు   మంత్రి కొల్లు రవీంద్ర

మంగళగిరి,  మేజర్‌న్యూస్‌ :

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన అవినీతి అక్రమాలు  ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. నాడు తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సూట్‌కేస్ కంపెనీల ద్వారా వ్యవస్థలను ప్రభావితం చేసినట్లే, గత ఐదేళ్లలో తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా అవినీతి సామ్రాజ్యాన్ని నడిపించారని ఆయన ఆరోపించారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో పలువురు ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారవేత్తలను అవినీతి ఊబిలోకి దింపిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిదని విమర్శించారు. నాటి పరిణామాలను రాష్ట్ర ప్రజలందరూ కళ్లారా చూశారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తులు నేడు వందల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులతో పట్టుబడుతున్నారని ఆయన ఎత్తిచూపారు. కేవలం రెండు లక్షల రూపాయల జీతం తీసుకునే ఉద్యోగుల భార్యలు, కుటుంబ సభ్యులు, అనుయాయుల పేరు మీద భారీగా ఆస్తులు, కంపెనీలు ఎలా వెలిశాయని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో మద్యం కుంభకోణం, ఇసుక, మైనింగ్, భూ కబ్జాల రూపంలో భారీ దోపిడీ జరిగిందని మంత్రి ఆరోపించారు. ఒక సాధారణ టిఫిన్ బండి నడుపుకునే వ్యక్తికి వందల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయో సమాజం మొత్తం చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. కింది స్థాయి వ్యక్తుల దగ్గరే వందల కోట్లు బయటపడుతుంటే, వీటన్నింటికీ యజమానిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇంకెన్ని లక్షల కోట్లు దోచుకున్నారో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. ఈ అక్రమాల వెనుక ఉన్న అసలు శక్తులు ఎవరనేది అతి త్వరలోనే పూర్తిస్థాయిలో బయటపడుతుందని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ప్రజాధనాన్ని దోచుకున్న ఏ ఒక్కరూ చట్టం నుంచి తప్పించుకోలేరని, బాధ్యులందరిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.

వైసీపీ హయాంలో దోచుకున్న సొమ్ము విదేశీ వ్యాపారాల్లో పెట్టుబడి 
గత ఐదేళ్ల వైసీపీ పరిపాలనలో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోచుకుని, ఆ సొమ్మును విదేశాల్లోని వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని, నాడు జరిగిన ఆర్థిక అక్రమాల మూలాలు నేడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో దోచుకున్న సొమ్మును దక్షిణాఫ్రికాలోని మద్యం, మైనింగ్ వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టారని మంత్రి విమర్శించారు. అలాగే, మాజీ ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలకంగా పనిచేసిన వ్యక్తులు ఫిలిప్పీన్స్, థాయిలాండ్, మలేషియా వంటి దేశాలకు నిధులను మళ్లించారని ఆరోపించారు. ఆ సొమ్మును తిరిగి దేశంలోకి తెచ్చుకోవడానికి సాఫ్ట్‌వేర్ కంపెనీలు, సూట్‌కేస్ కంపెనీలను సృష్టించి పెట్టుబడుల రూపంలో మార్చారని, వారి కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి నిధులు మళ్లించి షోరూమ్‌లు, భూములు కొనుగోలు చేశారని ఆయన పేర్కొన్నారు. తన అడుగులకు మడుగులొత్తే అనుయాయులకు వందల కోట్లు దోచిపెట్టారని, ఇటీవల జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు వివాహంలో కేవలం మద్యం కోసమే వందల కోట్లు ఖర్చు చేశారని మంత్రి ఆరోపించారు. మరోవైపు, ఆస్తిలో వాటా అడిగినందుకు సొంత చెల్లిని, తల్లిని ఇంటి నుంచి బయటకు పంపడమే కాకుండా, మేనకోడలి వివాహానికి కూడా సహకరించలేదని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన 'జే బ్రాండ్స్' మద్యం కారణంగా రాష్ట్రంలో దాదాపు 30 వేల మందికి పైగా మహిళలు చిన్న వయసులోనే వితంతువులుగా మారారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. నాసిరకం మద్యం వల్ల అనేకమందికి కిడ్నీ, లివర్ సమస్యలు, బ్రెయిన్ స్ట్రోక్‌లు వచ్చి ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆరోపించారు. ఐదేళ్ల పాటు సాగించిన దాడులు, విధ్వంసాలు, దోపిడీని ప్రజలు ఇంకా మర్చిపోలేదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందని, డిపాజిట్లు కూడా దక్కవనే భయంతోనే ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

జగన్ అవినీతి బాగోతాలపై వెబ్ సిరీస్ తీస్తే దానికి అంతం ఉండదు 
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు, దోపిడీలే ఆ పార్టీకి రాజకీయంగా సమాధి కట్టబోతున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. నాడు ఓబులాపురం గనుల అక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ పుస్తకం విడుదల చేసి పోరాడాయని, ఆ కేసులో ఆలస్యమైనా న్యాయస్థానం నుంచి ఖచ్చితమైన తీర్పు వచ్చిందని ఆయన గుర్తు చేశారు. గత ఐదేళ్లలో వైసీపీ నేతలు సాగించిన మద్యం దోపిడీ, పేదల భూముల ఆక్రమణలు, విధ్వంసాలపై తాము కేవలం వాస్తవాలను మాత్రమే ప్రజల ముందు ఉంచుతున్నామని మంత్రి స్పష్టం చేశారు. నాడు తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి సూట్‌కేస్ కంపెనీలు సృష్టించారన్న తమ ఆరోపణలు నిజమని తేలాయని ఆయన అన్నారు. వైసీపీ నేతల అవినీతి బాగోతాలపై వెబ్ సిరీస్ తీస్తే దానికి అంతం ఉండదని, అది ఒక అంతులేని కథలా సాగుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. గతంలో కొన్ని కోర్టులు, విదేశీ విశ్వవిద్యాలయాలు సైతం ఈ అవినీతిని 'ది బిగ్గెస్ట్ స్కామ్'గా అభివర్ణిస్తూ, ఒక సాధారణ నేరస్థుడి కంటే 'ఆర్థిక ఉన్మాది' అత్యంత ప్రమాదకారి అని వ్యాఖ్యానించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. చివరికి అవినీతి కేసుల్లో తనకు సంబంధం లేదని చెబుతూ, స్వయానా తండ్రినే దోషిగా నిలబెట్టిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిదని విమర్శించారు. రాష్ట్రంలో దోచుకున్న ప్రజాధనాన్ని దక్షిణాఫ్రికా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు తరలించి పెట్టుబడులు పెట్టారని మంత్రి ఆరోపించారు. అక్కడి ప్రభుత్వాలు కూడా వీరి కార్యకలాపాలపై దాడులు నిర్వహించాయని ఆయన పేర్కొన్నారు. గతంలో విదేశీ కంపెనీల ద్వారా పెట్టుబడుల పేరుతో సాక్షి, భారతీ సిమెంట్స్, భారతీ స్టీల్స్ వంటి సంస్థల్లోకి డబ్బులు మళ్లించి షేర్ విలువలు పెంచుకున్న తరహాలోనే, ఇప్పుడు విదేశాల్లో దొంగ సాఫ్ట్‌వేర్ కంపెనీలు సృష్టించి తిరిగి ఆ సొమ్మును దేశంలోకి తెచ్చుకోవడం వారికి నిత్యకృత్యంగా మారిందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు.