ఏజెంట్ల మాయమాటలకు బలి.. మలేషియా జైల్లో తెలుగు బిడ్డల నరకయాతన
సూర్య తాడ్వాయి :తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన యువకుడు అజ్జేపల్లి సురేష్ (32) ఏజెంట్లు చేసిన మోసానికి బలైపోయాడు.కుటుంబ ఆర్థిక కష్టాలను గట్టెక్కించాలని, విదేశాల్లో ఉద్యోగం చేసి నాలుగు రాళ్లు సంపాదించాలని ఎన్నో ఆశలతో విమానమెక్కిన ఓ భారతీయ యువకుడి జీవితం విషాదాంతమైంది. ఏజెంట్ వర్క్ వీసా అని నమ్మించి యువకుడిని మలేషియా దేశానికి పంపాడు.ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే ఇది వర్క్ వీసా కాదు టూరిస్ట్ వీసా అని తెలిసింది. నకిలీ ట్రావెల్ ఏజెంట్ల మాయమాటలను నమ్మి మలేషియా వెళ్లిన ఆ యువకుడు, వీసా మోసం కారణంగా అక్కడి పోలీసులకు చిక్కి ఆరు నెలల పాటు జైలు జీవితం గడిపాడు. భాష రాని దేశంలో, ఏ తప్పు చేయకుండానే జైలు పాలైన ఆ యువకుడు ఆరు నెలల పాటు నరకయాతన అనుభవించాడు. మరోవైపు స్వదేశంలో ఉన్న కుటుంబ సభ్యులు అతడిని విడిపించేందుకు ఏజెంట్ చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. జైలు నుంచి బయటకు తెచ్చేందుకు మరికొంత డబ్బు కావాలంటూ ఏజెంట్లు మరోసారి మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.జైల్లో ఉన్న సురేష్ కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఆ కుటుంబ సభ్యులు ఇకనైనా భర్తను స్వదేశానికి పంపాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.