సమగ్ర జనగణన చేపట్టండి
చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్. భారత జనాభా గణన-2027లో భాగంగా రెండో దశ జనాభా గణన నిర్వహణకు సంబంధించి ఫీల్డ్ ట్రైనర్లకు సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారులకు మూడు రోజుల జనగణన అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో
డి ఆర్ ఓ మోహన్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డి ఆర్ ఓ మాట్లాడుతూ జనగణన నిర్వహణపై మూడు రోజుల పాటు అందించే శిక్షణను అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిక్షణలో వివరించే ప్రతి అంశాన్ని శ్రద్ధగా విని, ముఖ్యమైన విషయాలను నోట్ చేసుకోవాలని, ఎలాంటి సందేహాలు ఉన్నా వెంటనే ప్రశ్నలను మాస్టర్ ట్రైనర్లను అడిగి నివృత్తి చేసుకోవాలని తెలిపారు. శిక్షణ పూర్తయ్యే సమయానికి ప్రతి ఒక్కరికీ జనాభా గణన ప్రక్రియపై పూర్తి అవగాహన ఉండాలని స్పష్టం చేశారు. జనాభా లెక్కింపు ద్వారా సేకరించే గణాంకాలు, దేశ ,రాష్ట్ర, జిల్లా స్థాయిలో అభివృద్ధి ప్రణాళికలు, సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. అందువల్ల సమాచార సేకరణలో కచ్చితత్వం, విశ్వసనీయతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జనాభా లెక్కింపు ప్రక్రియలో అనుసరించాల్సిన విధివిధానాలు క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలు, అధికారుల బాధ్యతలు, సాంకేతిక అంశాలపై ప్రతి ఒకరికి పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని సూచించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని. సాంకేతిక పరిజ్ఞానాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని తెలిపారు. సమాచార సేకరణ సమయంలో ఎదురయ్యే సందేహాలను వెంటనే నివృత్తి చేసుకుని, నిర్దేశిత పద్ధతులను కచ్చితంగా పాటించాలన్నారు జనగణన కార్యక్రమం విజయవంతం కావడంలో జిల్లా, చార్జి స్థాయి అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమనవ్యయం పేర్కొన్నారు.డిసెంబర్ నెలలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించి, నెలాఖరు లోగా శిక్షణ పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. అందుకు అనుగుణంగా ఫీల్డ్ ట్రైనర్లు ఇప్పటి నుంచే సిద్ధమై, తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ముని చంద్ర, లక్ష్మీ కళ, జనాభా గణనకు సంబంధించిన మాస్టర్ ట్రైనర్లు, ఫీల్డ్ ట్రైనర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.