విద్యార్థుల ఉన్నతికి చేయూత విద్యాభివృద్ధికి అవోపా దంపతుల బాసట
విద్యార్థుల ఉన్నతికి చేయూత. విద్యాభివృద్ధికి అవోపా దంపతుల బాసట
పెద్దకర్పాముల పాఠశాలలో ఎగ్జామినేషన్ ప్యాడ్ల పంపిణీ
పెద్దకొత్తపల్లి. సూర్య న్యూస్: విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తూ అవోపా జిల్లా అధ్యక్షులు కోదండరాములు, శశికళ దంపతులు సేవా కార్యక్రమం నిర్వహించారు. అవోపా కొల్లాపూర్ తాలూకా యూనిట్ ఆధ్వర్యంలో పెద్దకొత్తపల్లి మండలం పెద్దకర్పాముల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులకు ఎగ్జామినేషన్ ప్యాడ్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల అవసరాలను గుర్తించి వారికి అవసరమైన సహకారం అందించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. విద్యాభివృద్ధికి తమవంతు సహకారం అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థులకు ఉపయోగపడేలా సేవా కార్యక్రమం నిర్వహించడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జియావుద్దీన్, ఉపాధ్యాయులు అనిల్, ఉపాధ్యాయ బృందం, అవోపా కొల్లాపూర్ తాలూకా అధ్యక్షులు సోమిశెట్టి ప్రేమ్ కుమార్, పెద్దకర్పాముల గ్రామ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బాలరాజు, వినోద్, రవి, మణికంఠ, రాచూరి నాగరాజు, మిరియాల వెంకట నరసింహ తదితరులు పాల్గొన్నారు.