BREAKING
ఏ7 పేమెంట్ నెట్‌వర్క్ విస్తరణకు భారీ ప్రణాళికలు సీఐ టి యూ ఢిల్లీ ముట్టడి కార్యక్రమ పోస్టర్ల విడుదల గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ విజయం కూటమిదే - టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సెజ్నా జెట్ తయారీ సంస్థ టెక్స్ట్రాన్ సంచలన నిర్ణయం శ్రీ హరిహర క్షేత్రంలో శుక్రవారం నుండి సర్వ దీక్ష  స్వాములకు నిత్యాన్నదానం. ఐఎఫ్ఎఫ్ఐ అవార్డుకు నామినేట్ అయిన తొలి తెలుగు వెబ్ సిరీస్‌గా ‘మయసభ’ సరికొత్త చరిత్ర మిట్స్‌లో సాంకేతికత వ్యాపార రంగాల సమన్వయంపై అతిథి ఉపన్యాసం : ముఖ్య అతిథిగా హాజరైన పూర్వ విద్యార్థిని డి.హజీనాబి నిల్వ నీటిని తొలగిద్దాం... దోమల వ్యాప్తిని అరికడదాం.. సబ్ యూనిట్ అధికారి సిద్దయ్య నాగినేనిగుంట సర్పంచ్ అభ్యర్థి బరిలో మీరావలి ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించిన విద్యార్థులు ఇటలీ నౌకా నిర్మాణ దిగ్గజం కొనుగోలులో రష్యన్ లగ్జరీ నౌక కలకలం తిరుమలకు పాదయాత్ర సింహాద్రిపురం భక్త బృందం పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలో తనిఖీలు రూరల్ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకుందాం.. నగర మేయర్ రమేష్ గౌడ్ పశుగ్రాస కొరత నివారణకు 500 ఎకరాల్లో పచ్చిమేత సాగు

ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించిన విద్యార్థులు

Select Suryaa Now
ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించిన విద్యార్థులు

గడ్డమీది గంగారంలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించిన విద్యార్థులు

 ధారూర్,మేజర్ న్యూస్ :మండల పరిధిలోని గడ్డమీది గంగారం స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులే స్వయంగా సమయసూచికను రూపొందించుకుని,దాని ప్రకారం ఉపాధ్యాయులుగా వ్యవహరిస్తూ తరగతులకు వెళ్లి విద్యాబోధన చేశారు.మధ్యాహ్నం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఉపాధ్యాయులుగా మారిన విద్యార్థులు మాట్లాడారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి. నర్సింహులు మాట్లాడుతూ, తరగతి గదిలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తూ పాఠం బోధిస్తున్నప్పుడు పాఠాన్ని శ్రద్ధగా వినాలని విద్యార్థులు తెలుసుకున్నారని అన్నారు. తరగతి గదిలో నిశ్శబ్దంగా ఉన్నప్పుడే చెప్పిన విషయం సులభంగా అర్థమవుతుందని,ఈ విషయం విద్యార్థులకు అర్థమైందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో చైర్మన్ మహేశ్వరి,పాఠశాల ఉపాధ్యాయులు ఇందిర, జగదీశ్వరమ్మ,సుధాకర్, ఈ. వెంకటయ్య,అంజిరెడ్డి, బి.వెంకటయ్య పాల్గొన్నారు.