సీఐ టి యూ ఢిల్లీ ముట్టడి కార్యక్రమ పోస్టర్ల విడుదల
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : సిఐటియు ఆధ్వర్యంలో డిసెంబర్ ఒకటో తేదీ నుండి ఢిల్లీ ముట్టడి కార్యక్రమంకు సంబంధించి పోస్టర్లను బుధవారం ఆత్మకూరులోని సిపిఎం కార్యాలయంలో నాయకులు విడుదల చేశారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వివిధ డిమాండ్ల సాధన కోసం ఢిల్లీ ముట్టడి కార్యక్రమాన్ని రూపొందించామని నాయకులు పేర్కొన్నారు. నాలుగు లేబర్ కోడ్ లు రద్దు చేయాలని, స్కీం వర్కర్లను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం 42000 పెన్షన్ 21000 రూపాయలుగా నిర్ణయించాలని, ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణ ఆపాలని, ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని,కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ తదితర నాన్ పర్మినెంట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, వారికి సామాజిక భద్రత కల్పించాలని,నీరు, అడవి భూమిపై ప్రజల హక్కులు కాపాడాలని,సర్ కార్యక్రమాన్ని రద్దు చేయాలని తదితర డిమాండ్ల సాధన కోసం ఢిల్లీ ముట్టడి కార్యక్రమం రూపొందించామని నాయకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు జీ.వి. శివప్రసాద్, కొండమూరు హజరత్తయ్య, మండల అధ్యక్షుడు ఏ.నాగయ్య, మండల కార్యదర్శి కే. మహేష్, మండల నాయకులు టీ. పెంచలరావు, సిపిఎం పట్టణ అధ్యక్షుడు కే. డేవిడ్రాజు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్టు కమిటీ ప్రధాన కార్యదర్శి పి. రాధ, సెక్టార్ లీడర్లు ఏ. మస్తానమ్మ, వాణిశ్రీ,ఎల్ఐసి ఉద్యోగుల సంఘ నాయకుడు టి.రమేష్, హెల్త్ ఉద్యోగుల సంఘం నాయకుడు పి.జిలాని, మున్సిపల్ ఉద్యోగ సంఘ, కార్మిక సంఘ నాయకులు యు.గురవయ్య, దేవరపాటి చిన్నబాబు పలువురు ఆయా సంఘాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.