అభివృద్ధి పనులన్నీ డిసెంబర్ మొదటివారంలోనే ప్రారంభించాలి : నగర కమిషనర్
గుంటూరు : నగరంలో అన్ని అభివృద్ధి పనులు డిసెంబర్ మొదటివారం నాటికి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధ వారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నగరంలో నిర్వహిస్తున్న అభివృద్ధి పనుల పురోగతి పై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం నందు తొలుత ఏ.ఈ ల వారీగా వారి వారి డివిజన్ల లో నిర్వహిస్తున్న అభివృద్ధి పనుల పై సమీక్షించా రు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో అభివ్రుద్ది పనులు నిర్వహించుటకు వివిధ దశలలో ఉన్న పనులను సంబంధిత కాంట్రాక్టర్లు త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని, టెండర్ ప్రక్రియ పూర్తయ్యి పనులు ఇంకా ప్రారంబించని వాటిని నిబంధనల ప్రకారం నోటీసులు అందజేసి పనులను రద్దు చేసి మరలా రీ టెండర్ పిలవాలని ఏఈ లను ఆదేశించారు. 15వ ఆర్ధిక సంఘం పనులు, అమృత్ 2.0 పనులు కూడా వేగవంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, టెండర్ పిలవాల్సిన పనులకు త్వరగా టెండర్ పరిక్రియ పూర్తి చేసి, పనులు త్వరగా ప్రారంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. అభివృద్ధి పనులు జరిగే సమయంలో ఇంజనీరింగ్ అధికారులు క్షేత్ర స్తాయిలో పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తు, పనుల నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులు పూర్తయిన వెంటనే సదరు పనులకు సంబంధించి యం బుక్ రికార్డు చేయాలన్నారు. నగరంలోని ప్రధాన డ్రెయిన్లలో పూడికతీత పనులను పూర్తి చేయాలని, నగరంలో నూతనంగా నూతనంగా నిర్మిస్తున్న పార్కులు, పబ్లిక్ టాయిలెట్ల పనులు త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి పిజిఆర్ఎస్, 103 కాల్ సెంటర్ల ద్వారా అందే ఫిర్యాదులకు వెంటనే హాజరయ్యి, సమస్యల ప్రరిష్కారానికి ముందు తరువాత ఫోటోలను తీసి, సమస్యలను పరిష్కరించాలని అధికారులకు స్పష్టం చేశారు. వాటర్ మీటర్లకు సంబంధిం చి ఎక్కడా అవుట్ ఆఫ్ ఆర్డర్ అని ఉండడానికి వీలు లేదని, అటువంటి వాటిని డిస్ కనెక్షన్ చేసి, నూతన మీటర్లు ఏర్పాటు చేసుకోవాలని నోటీసులు ఇవ్వాలని ఏఈలను ఆదేశించారు. నగరంలో ఎక్కడా పాట్ హొల్స్ ఉండటానికి వీలులేదని, ఉన్న పాట్ హోల్స్ కు వెంటనే ప్యాచ్ వర్క్స్ ప్రారంభించి మరమ్మతులు నిర్వహించా లన్నారు. సమావేశంలో ఎస్ఈ జి.వెంకటేశ్వరరావు, ఈఈలు సుందర్రామిరెడ్డి, విష్ణు మూర్తి, వేణు గోపాల్, డిఈఈలు, ఏఈలు పాల్గొన్నారు.
సూర్య నాయక్