BREAKING
సొంత చెల్లిపై విషపు రాతలతో దిగజారుడు రాజకీయాలు : జగన్ పై మన్నవ మోహనకృష్ణ సంచలన వ్యాఖ్యలు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు నాయుడు దక్షతతొ రాష్ట్రాభివృద్ధి: ఎమ్మెల్యే నసీర్ డిసెంబర్ 11 నుంచి ఖేలో ఇండియా పోటీలు..లోగో, మస్కట్ గోడ పత్రికలను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్.. నేటి నుండి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం నిన్న వైసీపీ కండువా.. నేడు అమిలినేని సమక్షంలో టిడిపి కండువా వేసుకున్న నాయకులు. బాలీవుడ్ సంగీతంలో ఇప్పుడు సృజనాత్మక స్వేచ్ఛ కరువైంది.. లెజెండరీ సింగర్ కుమార్ సాను సంచలన వ్యాఖ్యలు కలకలం రేపుతున్న పెద్దపులి సంచారం వివాహ వార్షికోత్సవం, జన్మదినం సందర్భంగా అన్నప్రసాద వితరణ* బాలీవుడ్ చిత్రాల్లో సరికొత్త ట్రెండ్‌గా క్యారెక్టర్ రివీల్స్.. రామాయణంలో హనుమంతుడిగా సన్నీ డియోల్ పాత్ర హైలైట్ ఉక్రెయిన్‌కు మరో 45 బిలియన్ యూరోల రుణ సాయం ఇరాక్‌లో కతైబ్ హెజ్బొల్లా మిలీషియా ప్రాధాన్యత ఏమిటి కూతురి ఫోటోలు షేర్ చేయవద్దు.. పాప ప్రైవసీని గౌరవించండి అంటూ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ విజ్ఞప్తి రబీలో సాగు చేసే పంటలకు బీమా చేయించుకోవాలి. ఏవో యోకోసుకా నావల్ బేస్‌ను సందర్శించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

ఘనంగా జడ్పీజిహెచ్ఎస్ లో స్వయం పరిపాలన దినోత్సవం

Select Suryaa Now
ఘనంగా జడ్పీజిహెచ్ఎస్ లో స్వయం పరిపాలన దినోత్సవం

కొండపాక :

విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, బాధ్యతాయుతమైన ప్రవర్తన, పరిపాలనా నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా కొండపాక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం స్వయం పరిపాలన దినోత్సవాన్నీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. విఠల్ నాయక్ మాట్లాడుతూ.. విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా, భవిష్యత్తులో సమర్థవంతమైన నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో నిర్ణయాత్మక సామర్థ్యం, సమయపాలన, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సహకార భావనను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఒకరోజు ప్రధానోపాధ్యాయులుగా, ఉపాధ్యాయులుగా, వివిధ పరిపాలనా బాధ్యతలు నిర్వహించే అధికారులుగా వ్యవహరించి పాఠశాల నిర్వహణలో ప్రత్యక్ష అనుభవాన్ని పొందారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా తరగతి గదుల్లో పాఠ్యాంశాలను బోధిస్తూ తమ బోధనా ప్రతిభను, విషయ పరిజ్ఞానాన్ని, వ్యక్తీకరణ నైపుణ్యాలను ప్రదర్శించారు. ఒకరోజు ఉపాధ్యాయులుగా బాధ్యతలు నిర్వహించిన విద్యార్థులు పాఠశాల దైనందిన కార్యక్రమాలు, ఉపాధ్యాయుల విధులు, విద్యార్థుల క్రమశిక్షణ, పాఠశాల పరిపాలన వంటి అంశాలను స్వయంగా పరిశీలించి అవగాహన పొందారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ అనుభవాలను, అభిప్రాయాలను పంచుకుంటూ ఉపాధ్యాయుల బాధ్యతలు, ప్రధానోపాధ్యాయుల పరిపాలనా విధులు, వివిధ స్థాయిల్లో అధికారుల పాత్ర ఎంతటి ప్రాధాన్యత కలిగి ఉంటాయో తెలుసుకున్నారు. విద్యార్థులందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.