BREAKING
స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఫాక్స్‌కాన్ ద్వారా ఇప్పటికే 300 మందికి ఉపాధి చెన్నైలో సీ ఆర్ రాజన్ నూతన గృహప్రవేశం - హాజరైన ఎమ్మెల్యే జగన్ మోహన్ ప్లాస్టిక్ సర్జరీ వల్లే అలా మారిందంటూ ప్రచారం.. ట్రోల్స్‌పై తీవ్రంగా మండిపడ్డ హాలీవుడ్ నటి ఫ్లోరెన్స్ పుగ్ ఎం వెంకటం పల్లి లో వైసీపీకి షాక్... టిడిపిలో చేరిన ఏడు కుటుంబాలు. విదేశీ మారకద్రవ్య నిల్వలను పెంచేందుకు సీబీఎన్, ఎన్‌ఎన్‌పీసీ ఒప్పందం ఆరుతడి పంటల సాగుపై అన్నదాతలు మొగ్గు చూపాలి : పశుగ్రాసం,పచ్చిరొట్ట ఎరువుల పంటలు సాగు చేయాలి : వ్యవసాయ అధికారులచే రైతులకు అవగాహన పాఠశాలల్లో వంద శాతం హాజరే లక్ష్యంగా కృషి చేయాలి : ఎంఈఓ నిజాముద్దీన్ బ్రంట్ వర్క్‌వేర్‌ను సొంతం చేసుకున్న పెర్మిరా, ఫ్రీమాన్ స్పోగ్లీ కాంగ్రెస్ తోనే నిరుపేదల బతుకు మారుతుంది....! సొంత చెల్లిపై విషపు రాతలతో దిగజారుడు రాజకీయాలు : జగన్ పై మన్నవ మోహనకృష్ణ సంచలన వ్యాఖ్యలు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు నాయుడు దక్షతతొ రాష్ట్రాభివృద్ధి: ఎమ్మెల్యే నసీర్ డిసెంబర్ 11 నుంచి ఖేలో ఇండియా పోటీలు..లోగో, మస్కట్ గోడ పత్రికలను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్.. నేటి నుండి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం నిన్న వైసీపీ కండువా.. నేడు అమిలినేని సమక్షంలో టిడిపి కండువా వేసుకున్న నాయకులు.

ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు

Select Suryaa Now
ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు

సూర్య బిజినెస్ డెస్క్: ప్రయాణికుల డిమాండ్ తగ్గడం కంటే విపరీతంగా పెరిగిన ఇంధన ధరలే తమ లాభాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ గ్రూప్ ఛైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తౌమ్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో జెట్ ఫ్యూయల్ ధరలు రెట్టింపు కావడం మరియు ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా నిర్వహణ వ్యయం విపరీతంగా పెరిగినట్లు ఆయన వెల్లడించారు. కస్టమర్ల నుంచి డిమాండ్ మాత్రం పటిష్టంగానే ఉందని, అయితే విమానయాన ఇంధన ఖర్చులే ప్రధాన సమస్యగా మారాయని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలకు సంబంధించి ఎమిరేట్స్ గ్రూప్ తన ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. ఈ కాలంలో గ్రూప్ మొత్తం ఆదాయం 12 శాతం క్షీణించి 66.2 బిలియన్ దిర్హామ్‌లకు (సుమారు 18 బిలియన్ డాలర్లు) చేరుకోగా, పన్నుకు ముందు లాభం 4.1 బిలియన్ దిర్హామ్‌లుగా (1.1 బిలియన్ డాలర్లు) నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే లాభాలు దాదాపు 66 శాతం వరకు తగ్గినట్లు కంపెనీ తెలిపింది. అయితే ఈ క్లిష్ట పరిస్థితుల్లోనూ తమ కార్గో ఆపరేషన్స్ అత్యుత్తమ పనితీరు కనబరిచి ఆదాయాన్ని నిలకడగా ఉంచడంలో సహకరించాయని అల్ మక్తౌమ్ వివరించారు.

విమానయాన రంగంలో ఇంధన ఖర్చులదే సింహభాగం అని, ప్రస్తుతం ఎమిరేట్స్ ఆపరేటింగ్ ఖర్చులలో ఇంధనం వాటా ఏకంగా 34 శాతంగా ఉందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. హెడ్జింగ్ ప్రయోజనాలు కొంత వెసులుబాటు కల్పించినప్పటికీ, అంతర్జాతీయంగా ఇంధన ధరల అస్థిరత విమానయాన సంస్థల లాభదాయకతను దెబ్బతీస్తోంది. ఏది ఏప్పటికీ భవిష్యత్తుపై తాము సానుకూల దృక్పథంతో ఉన్నామని, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు నూతన విమానాల కొనుగోలు మరియు సాంకేతికతపై పెట్టుబడులను కొనసాగిస్తామని ఎమిరేట్స్ యాజమాన్యం స్పష్టం చేసింది.