BREAKING
స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఫాక్స్‌కాన్ ద్వారా ఇప్పటికే 300 మందికి ఉపాధి చెన్నైలో సీ ఆర్ రాజన్ నూతన గృహప్రవేశం - హాజరైన ఎమ్మెల్యే జగన్ మోహన్ ప్లాస్టిక్ సర్జరీ వల్లే అలా మారిందంటూ ప్రచారం.. ట్రోల్స్‌పై తీవ్రంగా మండిపడ్డ హాలీవుడ్ నటి ఫ్లోరెన్స్ పుగ్ ఎం వెంకటం పల్లి లో వైసీపీకి షాక్... టిడిపిలో చేరిన ఏడు కుటుంబాలు. విదేశీ మారకద్రవ్య నిల్వలను పెంచేందుకు సీబీఎన్, ఎన్‌ఎన్‌పీసీ ఒప్పందం ఆరుతడి పంటల సాగుపై అన్నదాతలు మొగ్గు చూపాలి : పశుగ్రాసం,పచ్చిరొట్ట ఎరువుల పంటలు సాగు చేయాలి : వ్యవసాయ అధికారులచే రైతులకు అవగాహన పాఠశాలల్లో వంద శాతం హాజరే లక్ష్యంగా కృషి చేయాలి : ఎంఈఓ నిజాముద్దీన్ బ్రంట్ వర్క్‌వేర్‌ను సొంతం చేసుకున్న పెర్మిరా, ఫ్రీమాన్ స్పోగ్లీ కాంగ్రెస్ తోనే నిరుపేదల బతుకు మారుతుంది....! సొంత చెల్లిపై విషపు రాతలతో దిగజారుడు రాజకీయాలు : జగన్ పై మన్నవ మోహనకృష్ణ సంచలన వ్యాఖ్యలు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు నాయుడు దక్షతతొ రాష్ట్రాభివృద్ధి: ఎమ్మెల్యే నసీర్ డిసెంబర్ 11 నుంచి ఖేలో ఇండియా పోటీలు..లోగో, మస్కట్ గోడ పత్రికలను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్.. నేటి నుండి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం నిన్న వైసీపీ కండువా.. నేడు అమిలినేని సమక్షంలో టిడిపి కండువా వేసుకున్న నాయకులు.

విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు నాయుడు దక్షతతొ రాష్ట్రాభివృద్ధి: ఎమ్మెల్యే నసీర్

Select Suryaa Now
విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు నాయుడు దక్షతతొ రాష్ట్రాభివృద్ధి:  ఎమ్మెల్యే నసీర్

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందని, యువతకు ,20 లక్షల ఉద్యోగాలు రానున్నాయని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనార్టీస్ కమిటీ చైర్మన్ నసీర్ అన్నారు. బుధవారం తూర్పు శాసనసభ్యుల వారి కార్యాలయంలో ఎమ్మెల్యే నసిర్ మీడియా సమావేశం నిర్వహించారు‌. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ వైజాగ్ వేదికగా రాష్ట్రంలో పెట్టుబడిల వరద సాగిందని తెలిపారు. విజనరీ లీడర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,, విద్యాశాఖ మంత్రి లోకేష్ దక్షతతో వ్యాపార సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని చెప్పారు. గూగుల్ వంటి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని చెప్పారు. గత వైసిపి ప్రభుత్వంలో రాష్ట్రంలోని ప్రధాన వ్యాపార సంస్థలు సైతం తరిమికొట్టారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో అన్ని విభాగాల్లో ఉద్యోగాల కల్పన ధ్యేయంగా కూడమి ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. గతంలో వ్యవసాయం రంగానికే రాష్ట్రంలో ప్రాధాన్యత ఉండేదని, ప్రస్తుతం వ్యాపార అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ వండి రంగాలను రాష్ట్రానికి తీసుకురావడం ద్వారా యువతకు మంచి భవిష్యత్ అందించే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు ఇదే కాకుండా ప్రతి నియోజకవర్గంలో ఉపాధి, నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు ద్వారా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.రాష్ట్ర వ్యాపార అభివృద్ధిలో మైలురాయి అని తెలిపారు.

 

సూర్య నాయక్