ఆర్ట్స్ కళాశాలలో ఘనంగా నేషనల్ నేచురోపతి డే
అనంతపురం విద్య మేజర్ న్యూస్:-ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల (స్వయంప్రతిపత్తి)లో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో బుధవారం నేషనల్ నేచురోపతి డే వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీరాములు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. ప్రకృతి వైద్యం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవచ్చన్నారు. సహజ ఆహారం, వ్యాయామం, యోగా, ధ్యానం, తగినంత విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు డా. బి. నాగభూషణం, డా. డి.సి. సుగప్ప, డా. బి. గోపాల్ నాయక్, డా. శ్రీనివాసులు ప్రకృతి వైద్యం, వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం, పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..