BREAKING
సొంత చెల్లిపై విషపు రాతలతో దిగజారుడు రాజకీయాలు : జగన్ పై మన్నవ మోహనకృష్ణ సంచలన వ్యాఖ్యలు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు నాయుడు దక్షతతొ రాష్ట్రాభివృద్ధి: ఎమ్మెల్యే నసీర్ డిసెంబర్ 11 నుంచి ఖేలో ఇండియా పోటీలు..లోగో, మస్కట్ గోడ పత్రికలను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్.. నేటి నుండి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం నిన్న వైసీపీ కండువా.. నేడు అమిలినేని సమక్షంలో టిడిపి కండువా వేసుకున్న నాయకులు. బాలీవుడ్ సంగీతంలో ఇప్పుడు సృజనాత్మక స్వేచ్ఛ కరువైంది.. లెజెండరీ సింగర్ కుమార్ సాను సంచలన వ్యాఖ్యలు కలకలం రేపుతున్న పెద్దపులి సంచారం వివాహ వార్షికోత్సవం, జన్మదినం సందర్భంగా అన్నప్రసాద వితరణ* బాలీవుడ్ చిత్రాల్లో సరికొత్త ట్రెండ్‌గా క్యారెక్టర్ రివీల్స్.. రామాయణంలో హనుమంతుడిగా సన్నీ డియోల్ పాత్ర హైలైట్ ఉక్రెయిన్‌కు మరో 45 బిలియన్ యూరోల రుణ సాయం ఇరాక్‌లో కతైబ్ హెజ్బొల్లా మిలీషియా ప్రాధాన్యత ఏమిటి కూతురి ఫోటోలు షేర్ చేయవద్దు.. పాప ప్రైవసీని గౌరవించండి అంటూ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ విజ్ఞప్తి రబీలో సాగు చేసే పంటలకు బీమా చేయించుకోవాలి. ఏవో యోకోసుకా నావల్ బేస్‌ను సందర్శించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన డిడిఓ అమానుల్లా.

Select Suryaa Now
ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన డిడిఓ అమానుల్లా.

 

సెట్టూరు: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను కల్యాణదుర్గం డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (డీడీఓ) శ్రీ అమనుల్లా బుధవారం పరిశీలించారు. సెట్టూరు మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను ఆయన క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. అదేవిధంగా రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం సిద్ధం చేసిన బ్యాలెట్ పెట్టెలను పరిశీలించి వాటి పరిస్థితి, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఎన్నికల సామగ్రి భద్రత తదితర అంశాలను సమీక్షించారు. ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, ఎన్నికల సామగ్రిని జాగ్రత్తగా భద్రపరచాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం డీడీఓ అమనుల్లా సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సెట్టూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ), ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

 ఖాసిం, నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్ సెట్టూరు