రబీలో సాగు చేసే పంటలకు బీమా చేయించుకోవాలి. ఏవో
సూర్య న్యూస్ అద్దంకి.
రబీ సీజన్ లో సాగు చేసే పంటలకు బీమా చేయించుకోవాలని మండల వ్యవసాయాధికారి కొర్రపాటి వెంకటకృష్ణ సూచించారు. మైలవరం, ఉప్పలపాడు గ్రామాలలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమం లో భాగం గా వ్యవసాయాధికారి మాట్లాడుతూ రబీ సీజన్ లో సాగు చేసిన శనగ పంట ఎకరాకు 84 రూపాయలు, మొక్కజొన్న పంట కి 105 రూపాయలు, వరి కి 126 రూపాయలు, మినుము కి 60 రూపాయలు, పెసర కి 36 రూపాయలు , వేరుశనగ కి 60 రూపాయలు జొన్న కి 38 రూపాయలు ఎకరాకు మీ సమీప మీ సేవా కేంద్రాలలో చెల్లించాలని తరువాత మీరు సాగు చేసిన పంట ఈ పంట నమోదు చేసుకోవాలని సూచించారు. ఫెర్టిలైజర్ ఫ్రేమ్ వర్క్ స్కీమ్ ద్వారానే ఎరువుల పంపిణీ జరుగుతుందని తెలిపారు. రైతులు అవగాహన కోసం సంబంధిత గ్రామ వ్యవసాయ సహాయకులు లను కలిసి వివరాలు మరియు ఎరువులు పొందవచ్చని తెలిపారు. కార్యక్రమం లో ఆత్మ బ్లాక్ టెక్నాలజీ మేనేజర్ శేషారావు, అసిస్టెంట్ టెక్నాలజీ మేనేజర్ రామిరెడ్డి, గ్రామ వ్యవసాయ సహాయకులు పవన్. సాయి తదితరులు పాల్గొన్నారు.