BREAKING
స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఫాక్స్‌కాన్ ద్వారా ఇప్పటికే 300 మందికి ఉపాధి చెన్నైలో సీ ఆర్ రాజన్ నూతన గృహప్రవేశం - హాజరైన ఎమ్మెల్యే జగన్ మోహన్ ప్లాస్టిక్ సర్జరీ వల్లే అలా మారిందంటూ ప్రచారం.. ట్రోల్స్‌పై తీవ్రంగా మండిపడ్డ హాలీవుడ్ నటి ఫ్లోరెన్స్ పుగ్ ఎం వెంకటం పల్లి లో వైసీపీకి షాక్... టిడిపిలో చేరిన ఏడు కుటుంబాలు. విదేశీ మారకద్రవ్య నిల్వలను పెంచేందుకు సీబీఎన్, ఎన్‌ఎన్‌పీసీ ఒప్పందం ఆరుతడి పంటల సాగుపై అన్నదాతలు మొగ్గు చూపాలి : పశుగ్రాసం,పచ్చిరొట్ట ఎరువుల పంటలు సాగు చేయాలి : వ్యవసాయ అధికారులచే రైతులకు అవగాహన పాఠశాలల్లో వంద శాతం హాజరే లక్ష్యంగా కృషి చేయాలి : ఎంఈఓ నిజాముద్దీన్ బ్రంట్ వర్క్‌వేర్‌ను సొంతం చేసుకున్న పెర్మిరా, ఫ్రీమాన్ స్పోగ్లీ కాంగ్రెస్ తోనే నిరుపేదల బతుకు మారుతుంది....! సొంత చెల్లిపై విషపు రాతలతో దిగజారుడు రాజకీయాలు : జగన్ పై మన్నవ మోహనకృష్ణ సంచలన వ్యాఖ్యలు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు నాయుడు దక్షతతొ రాష్ట్రాభివృద్ధి: ఎమ్మెల్యే నసీర్ డిసెంబర్ 11 నుంచి ఖేలో ఇండియా పోటీలు..లోగో, మస్కట్ గోడ పత్రికలను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్.. నేటి నుండి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం నిన్న వైసీపీ కండువా.. నేడు అమిలినేని సమక్షంలో టిడిపి కండువా వేసుకున్న నాయకులు.

సొంత చెల్లిపై విషపు రాతలతో దిగజారుడు రాజకీయాలు : జగన్ పై మన్నవ మోహనకృష్ణ సంచలన వ్యాఖ్యలు

Select Suryaa Now
సొంత చెల్లిపై విషపు రాతలతో దిగజారుడు రాజకీయాలు : జగన్ పై మన్నవ మోహనకృష్ణ సంచలన వ్యాఖ్యలు

పత్రికా స్వేచ్ఛ పేరుతో మహిళల వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించడం సమంజసం కాదని,రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమే కానీ, వాటి కోసం మహిళల వ్యక్తిత్వాన్ని కించపరచడం సరికాదని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ వ్యాఖ్యానించారు. మీడియా సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ సమాజంలో విలువలను పెంపొందించాలి తప్ప,వ్యక్తిగత కక్షలతో మహిళల గౌరవాన్ని దెబ్బతీయకూడదన్నారు.రాజకీయ  కనీస విలువలు లేకుండా కుటుంబ వ్యవహారాలను కూడా రాజకీయ కక్ష కోణంలో చూస్తూ, జుగుప్సాకరమైన రాతలు రాయించడం ఒక్క జగన్ మోహన్ రెడ్డికి మాత్రమే చెల్లిందని మండిపడ్డారు.ఏపీ కాంగ్రెస్ నాయకురాలు వై.ఎస్ షర్మిల తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను అందించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిస్తే, దానిపై 'బాబుతో చెట్టపట్టాల్' అంటూ తన పత్రికలో అత్యంత నీచంగా వార్తలు రాయడం దారుణమని అన్నారు.ఒక మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, ప్రస్తుత ముఖ్యమంత్రిని, అందులోనూ తన తండ్రి లాంటి వ్యక్తిని కలిసి తన కూతురి పెళ్లికి రావాల్సిందిగా ఆహ్వానిస్తే,దానిని కూడా దుర్మార్గంగా వక్రీకరించి, అసభ్యకరమైన పదజాలంతో రాయించేలా జగన్ మోహన్ రెడ్డి దిగజారిపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.తన పత్రిక ద్వారా జగన్ అవమానించింది కేవలం షర్మిలను మాత్రమే కాదని, ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని, యావత్ మహిళా లోకాన్ని అవమానించారని అన్నారు.రాజకీయ లబ్ధి కోసం సొంత కుటుంబ సభ్యుల వ్యక్తిత్వాన్ని కూడా కించపరిచే ఇలాంటి దిగజారుడు రాతలను తక్షణమే ఆపాలని అన్నారు.రాజకీయ అస్తిత్వం కోసం మహిళలను పావులుగా వాడుకోవడం మానుకోవాలని మోహనకృష్ణ సూచించారు.

అనిల్ కాంత్.కె....గుంటూరు ప్రతినిథి