కాంగ్రెస్ తోనే నిరుపేదల బతుకు మారుతుంది....!
మర్రిగూడ, మేజర్ న్యూస్; కాంగ్రెస్ ప్రభుత్వం తోటే నిరుపేదల బతుకు మారుతుందని మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కోడాల వెంకటరెడ్డి అన్నారు.బుధవారం మునుగోడు క్యాంపు కార్యాలయంలో చేయూత పింఛన్ పత్రాలను లబ్ధిదారులకు అందజేసి ఆయన మాట్లాడారు. ఎన్నో సంవత్సరాలుగా ఎప్పుడు ఎప్పుడు అని ఎదురుచూస్తున్న పెన్షన్ లబ్ధిదారుల లిస్టు కాంగ్రెస్ ప్రభుత్వం బయట పెట్టడంతో నిరుపేద కళ్ళలో ఆనందం చిగురించిందని తెలిపారు. ఏ ప్రభుత్వం చేయని నిరుపేదలకు గృహాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లతో వారి కళ సహకారం చేసిందని తెలిపారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతో నియోజకవర్గ అన్ని రంగాల్లో అభివృద్ధి పెడుతుందని రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే మరింత అభివృద్ధి సాధిస్తుందని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.