BREAKING
సొంత చెల్లిపై విషపు రాతలతో దిగజారుడు రాజకీయాలు : జగన్ పై మన్నవ మోహనకృష్ణ సంచలన వ్యాఖ్యలు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు నాయుడు దక్షతతొ రాష్ట్రాభివృద్ధి: ఎమ్మెల్యే నసీర్ డిసెంబర్ 11 నుంచి ఖేలో ఇండియా పోటీలు..లోగో, మస్కట్ గోడ పత్రికలను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్.. నేటి నుండి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం నిన్న వైసీపీ కండువా.. నేడు అమిలినేని సమక్షంలో టిడిపి కండువా వేసుకున్న నాయకులు. బాలీవుడ్ సంగీతంలో ఇప్పుడు సృజనాత్మక స్వేచ్ఛ కరువైంది.. లెజెండరీ సింగర్ కుమార్ సాను సంచలన వ్యాఖ్యలు కలకలం రేపుతున్న పెద్దపులి సంచారం వివాహ వార్షికోత్సవం, జన్మదినం సందర్భంగా అన్నప్రసాద వితరణ* బాలీవుడ్ చిత్రాల్లో సరికొత్త ట్రెండ్‌గా క్యారెక్టర్ రివీల్స్.. రామాయణంలో హనుమంతుడిగా సన్నీ డియోల్ పాత్ర హైలైట్ ఉక్రెయిన్‌కు మరో 45 బిలియన్ యూరోల రుణ సాయం ఇరాక్‌లో కతైబ్ హెజ్బొల్లా మిలీషియా ప్రాధాన్యత ఏమిటి కూతురి ఫోటోలు షేర్ చేయవద్దు.. పాప ప్రైవసీని గౌరవించండి అంటూ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ విజ్ఞప్తి రబీలో సాగు చేసే పంటలకు బీమా చేయించుకోవాలి. ఏవో యోకోసుకా నావల్ బేస్‌ను సందర్శించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

ఇందిరమ్మ ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఆధారం..

Select Suryaa Now
ఇందిరమ్మ ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఆధారం..

కనగల్ మేజర్ న్యూస్: ఇందిరమ్మ ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు చేయూత అందిస్తుందని మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మండలంలోని బుధవారం అమ్మగూడెం , పగిడిమర్రి ,ఏం రెడ్డిగూడెం, ఎం గౌరారం, పర్వతగిరి, బుడుమర్లపల్లి, జి ఎడవల్లి,గ్రామాల్లో ఇందిరమ్మ ఆసరా పెన్షన్ ప్రొసీడింగ్ కాపీలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి మాట్లాడుతూ చేనేత కార్మికులకు గీతా కార్మికులకు దివ్యాంగులకు వితంతువులకు ప్రభుత్వం మంజూరు చేసిన నూతన పెన్షన్ దారులకు ఎంతో చేయూతని ఇ స్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ పేదల సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆసరా పెన్షన్లు, మహిళలకు చీరలు, రేషన్ కార్డులు, రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఒక్కొక్కరు చొప్పున 6 కిలోల బియ్యం ఉచితంగా అందించడం జరుగుతుందని వివరించారు. త్వరలోనే జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తుందన్నారు. గత ప్రభుత్వం అభివృద్ధిని గాలికి వదిలేసి, సంక్షేమ పథకాలను తుంగలో తొక్కారని విమర్శించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ ఫలాలను అందించడం జరుగుతుందన్నారు. ఆయా కార్యక్రమాలలో మండల పార్టీ అధ్యక్షులు గడ్డం అనుపు రెడ్డి, నాయకులు , ఆర్టిఏ నెంబర్ కూసుకుంట్ల రాజు రెడ్డి, ఆత్మ చైర్మన్ గోలి జగాల్ రెడ్డి, సర్పంచులు కొండరవలి అంజయ్య, వెంకటేశం, ఊర లింగయ్య , సీనియర్ నాయకులు మందడి రామచంద్ర రెడ్డి,కృష్ణారెడ్డి, బీరెల్లి నాగరాజు,రామ్ రెడ్డి, మోహన్ రెడ్డి, బక్క రాజశేఖర్, ముత్తయ్య, ఎల్లయ్య, చెనగోని యాదగిరి, నవ్య జ్యోతి, ఆయా గ్రామాల ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, మహిళలు, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, మాజీ సర్పంచులు, ఉపసర్పంచ్లు, గ్రామాల్లోని పెద్దలు, యువకులు, వృద్ధులు తదితరులు పాల్గొన్నారు.