రోడ్డు ప్రమాదంలో ఇద్దరి వ్యక్తులకు గాయాలు
సూర్య కమ్మర్ పల్లి:మండలంలోని హాసా కొత్తూర్ గ్రామంలో ఇందిరమ్మ కాలనీ సమీపంలో బుధవారం ఉదయం కమ్మర్ పల్లి నుండి హాసాకొత్తూర్ కి మేస్త్రి కూలి పనికి బైకు పై వెళ్తున్న అనిల్, రాజన్న అదుపు తప్పి చెట్టును డీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. అక్కడ ఉన్న స్థానికులు వెంటనే 108 అంబులెన్సు కి కాల్ చేయగా వారిని జగిత్యాల్ ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్లినట్లు, అనిల్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఈఎంటి సదానంద్, పైలట్ రమేష్ తెలిపారు.ఈ సందర్బంగా ప్రయాణికులు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరుగకుండా రోడ్డు మూలమాలుపు, ప్రమాదకర ప్రాంతలలో సూచిక బోర్డ్ లు ఏర్పాటు చెయ్యాలని రోడ్డు రవాణా శాఖ సంబంధిత అధికారులను ప్రయాణికులు, స్నానిక ప్రజలు కోరడం జరిగింది.