BREAKING
జి.డి.డీ. దివాకర్‌ను కలిసి మద్దతు కోరిన బొట్లగుంట శ్రీహరి నాయుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కీలక నిర్ణయం.. హైదరాబాద్ ప్రాపర్టీ విక్రయం వెనుక అసలు కారణం ఇదేనా? ప్రమాణ స్వీకారం చేయనున్న ప్రాదేశిక ప్రతినిధులు ఎంఎస్ ధోని ఐపీఎల్ నిష్క్రమణపై సెలబ్రిటీల భావోద్వేగ స్పందన.. ఇకపై ఆట పూర్వలా ఉండదన్న ప్రముఖులు ఇంకొల్లులో ఏడు నామినేషన్లు తిరస్కరణ క్రీడలు ఏకాగ్రతను పెంచుతాయి. తొలిరోజు నామినేషన్ల జోరు.. సర్పంచ్‌లకు 13, వార్డు సభ్యులకు 36!** **నన్నూరులో టీడీపీ వర్గీయుల మధ్య స్వల్ప ఉద్రిక్తత** ముండ్లమూరులో సర్పంచ్ లకు 22 నామినేషన్లు కావలి భవిష్యత్తు కోసం కూటమికి అవకాశం ఇవ్వండి: ఎమ్మెల్యే కావ్య. రాష్ట్ర స్కేటింగ్‌లో కర్నూలుకు పతకాలు రాప్తాడు కేసు నిందితుడుకి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స – వైద్య చికిత్స అనంతరం డిశ్చార్జ్ రేపు కంబదూరు ఎంపీపీ ఎన్నిక... ఎవరికి దక్కనుందో పీఠం. రోడ్డు ప్రమాదంలో ఇద్దరి వ్యక్తులకు గాయాలు 27వ ఆల్ ఇండియా పోలీస్ బ్యాండ్ పోటీల్లో ప్రత్యేక అతిథిగా హీరో కృష్ణసాయి.. సీఆర్‌పీఎఫ్ సేవలపై ప్రశంసల జల్లు మున్సిపల్ ఛైర్మనుతో బీజేపీ నేతల ఆత్మీయ సమావేశం : శ్రీరామ్ చినబాబుకు అభినందనలు తెలిపిన చల్లపల్లె,ఎన్.సేతు

రేపు కంబదూరు ఎంపీపీ ఎన్నిక... ఎవరికి దక్కనుందో పీఠం.

Select Suryaa Now
రేపు కంబదూరు ఎంపీపీ ఎన్నిక... ఎవరికి దక్కనుందో పీఠం.

కంబదూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల మేరకు కంబదూరు మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం ఎంపీపీ ఎంపికకు పరోక్ష ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ మేరకు మండల పరిధిలోని 15 ఎంపీటీసీ సెగ్మెంట్లలో విజయం సాధించిన సభ్యులకు స్థానిక ఎంపీడీవో సూర్యనారాయణ ఆహ్వాన పత్రాలను అందజేశారు. కంబదూరు ఎంపీపీ స్థానం ఎస్సీ జనరల్‌కు కేటాయించడంతో మర్రిమాకులపల్లి, ములకనూరు, తిమ్మాపురం గ్రామాలకు చెందిన ఎంపీటీసీ సభ్యులకు మాత్రమే ఎంపీపీగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. మండలంలో మొత్తం 15 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, రాళ్ల అనంతపురం ఎంపీటీసీ మినహా మిగిలిన 14 స్థానాల్లో టీడీపీ కూటమి బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో ఎంపీపీ ఎన్నికలో కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ, సభ్యుల హాజరు, కోరం కీలకంగా మారనున్నాయి. మరోవైపు ఎంపీపీ అభ్యర్థి ఎంపికలో కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ అధిష్టానం నిర్ణయం, కీలక నాయకుల ఆశీస్సులు కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటీవల స్వతంత్ర జెడ్పీటీసీ అభ్యర్థి వేముల శారద చౌదరి విజయం వెనుక టీడీపీకి చెందిన కీలక నేత మద్దతు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో కంబదూరు ఎంపీపీ పీఠం ఎవరిని వరించనుందన్న ఉత్కంఠ నెలకొంది. గురువారం జరిగే పరోక్ష ఎన్నికతో ఈ ఉత్కంఠకు తెరపడనుంది.