మున్సిపల్ ఛైర్మనుతో బీజేపీ నేతల ఆత్మీయ సమావేశం : శ్రీరామ్ చినబాబుకు అభినందనలు తెలిపిన చల్లపల్లె,ఎన్.సేతు
మదనపల్లె టౌన్,మేజర్ న్యూస్ : మదనపల్లె మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి శ్రీరామ్ కుమార్ (చినబాబు)ను పలువురు బీజేపీ,జనసేన నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఇందులో భాగంగా చైర్మన్ శ్రీరామ్ చినబాబును శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.బీజేపీ సీనియర్ నాయకులు చల్లపల్లె నరసింహారెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,విజయభారతి విద్యాసంస్థ ఛైర్మన్ డాక్టర్ ఎన్.సేతు నల్లుస్వామి,కృష్ణమూర్తి ఆకుల,డాక్టర్ అజ్మతుల్లా ఖాన్,జనార్ధన్ రెడ్డి,టిడిపి సీనియర్ నాయకులు రామిశెట్టి కృష్ణ (కమలామర్రి) తదితరులు ఆయనను కలిసిన వారిలో ఉన్నారు.ఈ సందర్భంగా నరసింహారెడ్డి,సేతులు మాట్లాడుతూ నిరంతరం ప్రజాశ్రేయస్సు కోసం పరితపించి అందరి ప్రశంసలు అందుకుంటూ అంచలంచెలుగా ఎదిగి టిడిపి తరఫున మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా శ్రీరామ్ చినబాబు అఖండ విజయం సాధించడం గర్వకారణమన్నారు.ఆయన సారధ్యంలో మదనపల్లి పట్టణం అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షించారు.అనంతరం శ్రీరామ్ చినబాబు మాట్లాడుతూ తన విజయానికి సహకరించిన కూటమి నేతలు,పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.ప్రజాసమస్యల పరిష్కారం,పట్టణ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేసే వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు.కూటమి నాయకుల మధ్య భేటీ స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి