క్రీడలు ఏకాగ్రతను పెంచుతాయి.
తరచూ క్రీడలలో
పాల్గొనే విద్యార్థుల ఏకాగ్రతను మరింతగా
పెంచుకుంటారని ఈ కిడ్స్ విభాగం కో ఆర్డినేటర్ అరుణ తెలిపారు. స్కూల్ క్లస్టర్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రిన్సిపల్ మహమ్మద్ అల్తాఫ్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక మాధవ నగర్ లోని నారాయణ పాఠశాలలో నారాయణ ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు జరిగాయి. ముందుగా అతిధుల చేతుల మీదుగా క్రీడా జ్యోతిని వెలిగించిన అనంతరం విద్యార్థుల గౌరవ వందనంతో పోటీలను ప్రారంభించారు.
క్రీడా వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కో ఆర్డినేటర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పోటి ప్రపంచంలో
నారాయణ యాజమాన్యం చదువు, క్రీడలకు సమాన ప్రాముఖ్యత ఇస్తుందన్నారు. పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు మెమొంటో, ధ్రువపత్రాలు అతిథుల చేతులు మీదుగా అందజేశారు. కార్యక్రమంలో చిన్నారుల సాంసృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ స్వప్న, టీచర్ పాల్గొన్నారు.