BREAKING
రూరల్ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకుందాం.. నగర మేయర్ రమేష్ గౌడ్ పశుగ్రాస కొరత నివారణకు 500 ఎకరాల్లో పచ్చిమేత సాగు కంబల్లె సర్పంచ్ అభ్యర్థిగా ఓబులమ్మ నామినేషన్... ఎమ్మెల్సీ దంపతుల మద్దతు భారీ ర్యాలీ కార్యకర్తల్లో ఉత్సాహం ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి ముత్తుకూరు టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా షబ్బీర్ ఎంపిక పామూరు అభివృద్ధే నా లక్ష్యం.. ప్రజాసేవకే నా ప్రాధాన్యం అమెరికాలో రియల్ రంగంలో భిన్న వాతావరణం నూతన జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌కు కొడంగల్ పాత్రికేయుల ఘన సన్మానం ఉత్తర కొరియా అణు కార్యకలాపాల విస్తరణ కావలి మున్సిపల్ ఎన్నికల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు బీ-ఫారాల అందజేసిన వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు కాకాని. ‘ఇండియా జాయ్ 2026’ విజయానికి టాలీవుడ్ సంపూర్ణ సహకారం.. సచివాలయ భేటీలో ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు, సురేష్ బాబు నామినేషన్ల వేళ వేములలో వైసిపి మద్దతుదారులపై రాజకీయ దాడులు... స్కార్పియో వాహనం ధ్వంసం సిబ్బంది తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలి - కమిషనర్ బాలికలకు కరాటే శిక్షణ ఇటలీ పార్లమెంట్‌లో తీవ్ర దుమారం

ఓలేరు, వెల్లటూరు గ్రామాల్లో పొలం పిలుస్తోంది

Select Suryaa Now
ఓలేరు, వెల్లటూరు గ్రామాల్లో పొలం పిలుస్తోంది

భట్టిప్రోలు, మేజర్ న్యూస్:
భట్టిప్రోలు మండల పరిధిలోని వెల్లటూరు, ఓలేరు గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి బి బ్రహ్మరెడ్డి మాట్లాడుతూ, ఈ రబీ సీజన్ నుంచి ఎరువుల పంపిణీకి ఎఫ్ ఎఫ్ ఎస్, అనే కొత్త యాప్ రానుందని తెలిపారు. ఈ యాప్ ద్వారా ప్రతీ రైతూ తమకి తామే ఎరవులు బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. తదుపరి వచ్చిన క్యూఆర్ కోడ్ తో గం 48 ల లోపు నిర్దేశించిన దుకాణాల్లో ఎరువులు పొందవచ్చని అన్నారు. తర్వాత ఆయా గ్రామాల్లో వరి పంటని పరిశీలించారు. వరిలో ఆకు ముడత పురుగుని గుర్తించారు. ప్రస్తుతానికి ఉధృతి తక్కువగా ఉందని, కావున రసాయన పురుగు మందులు అవసరం లేదని తెలిపారు .ఒకవేళ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఫ్లూబెండ మైడ్ 0.5 మి.లీ / లీటరు నీటికి లేదా క్లోరిపైరిఫాస్  2.5 మి.లీ/లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి అని సూచించారు. ఈ కార్యక్రమం లో విహెచ్ ఏ లు సాగర్ , రాజేశ్వరి ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.