BREAKING
శ్రీ హరిహర క్షేత్రంలో శుక్రవారం నుండి సర్వ దీక్ష  స్వాములకు నిత్యాన్నదానం. ఐఎఫ్ఎఫ్ఐ అవార్డుకు నామినేట్ అయిన తొలి తెలుగు వెబ్ సిరీస్‌గా ‘మయసభ’ సరికొత్త చరిత్ర మిట్స్‌లో సాంకేతికత వ్యాపార రంగాల సమన్వయంపై అతిథి ఉపన్యాసం : ముఖ్య అతిథిగా హాజరైన పూర్వ విద్యార్థిని డి.హజీనాబి నిల్వ నీటిని తొలగిద్దాం... దోమల వ్యాప్తిని అరికడదాం.. సబ్ యూనిట్ అధికారి సిద్దయ్య నాగినేనిగుంట సర్పంచ్ అభ్యర్థి బరిలో మీరావలి ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించిన విద్యార్థులు ఇటలీ నౌకా నిర్మాణ దిగ్గజం కొనుగోలులో రష్యన్ లగ్జరీ నౌక కలకలం తిరుమలకు పాదయాత్ర సింహాద్రిపురం భక్త బృందం పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలో తనిఖీలు రూరల్ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకుందాం.. నగర మేయర్ రమేష్ గౌడ్ పశుగ్రాస కొరత నివారణకు 500 ఎకరాల్లో పచ్చిమేత సాగు కంబల్లె సర్పంచ్ అభ్యర్థిగా ఓబులమ్మ నామినేషన్... ఎమ్మెల్సీ దంపతుల మద్దతు భారీ ర్యాలీ కార్యకర్తల్లో ఉత్సాహం ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి ముత్తుకూరు టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా షబ్బీర్ ఎంపిక పామూరు అభివృద్ధే నా లక్ష్యం.. ప్రజాసేవకే నా ప్రాధాన్యం

కంబల్లె సర్పంచ్ అభ్యర్థిగా ఓబులమ్మ నామినేషన్... ఎమ్మెల్సీ దంపతుల మద్దతు భారీ ర్యాలీ కార్యకర్తల్లో ఉత్సాహం

Select Suryaa Now
కంబల్లె సర్పంచ్ అభ్యర్థిగా ఓబులమ్మ నామినేషన్... ఎమ్మెల్సీ దంపతుల మద్దతు భారీ ర్యాలీ కార్యకర్తల్లో ఉత్సాహం

సింహాద్రిపురం మేజర్ న్యూస్ :

మండల పరిధిలోని కంబల్లె గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా చాట్ల ఓబులమ్మ బుధవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. లోమడ సచివాలయంలో నిర్వహించిన నామినేషన్ కార్యక్రమానికి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, ఆయన సతీమణి భూమిరెడ్డి ఉమాదేవి ముఖ్య అతిథులుగా హాజరై ఆమెకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు తరలివచ్చారు. కంబల్లె గ్రామం నుంచి లోమడ వరకు భారీ ర్యాలీగా బయలుదేరి నామినేషన్ దాఖలు చేశారు. డప్పులు, పూలదండలతో కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ఓబులమ్మ కృషి చేస్తారని, గ్రామస్తులంతా ఐక్యంగా ఉండి ఆమెను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. గ్రామంలోని ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని, రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం వంటి మౌలిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. భూమిరెడ్డి ఉమాదేవి మాట్లాడుతూ మహిళా సర్పంచ్ అభ్యర్థిగా ఓబులమ్మను గెలిపిస్తే గ్రామంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తామన్నారు. మహిళలు, రైతులు, యువత అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు. అభ్యర్థి చాట్ల ఓబులమ్మ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చిన నాయకులకు, గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, అందరి ఆదరాభిమానాలు చూరగొంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కూటమి కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

జాకీర్ సింహాద్రిపురం రిపోర్టర్ కడప జిల్లా