నాగినేనిగుంట సర్పంచ్ అభ్యర్థి బరిలో మీరావలి
మర్రిపాడు, మేజర్ న్యూస్ : మర్రిపాడు మండలంలోని నాగినేనిగుంట పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా షేక్ మీరావలి పోటీ చేస్తున్నారు. ఈ తరుణంలో విద్యావంతుడైన మీరావలికి పంచాయితీ పరిధిలోని నాగినేనిగుంటతో పాటుగా బాట, ఏనేపల్లి, మిట్టపాలెం గ్రామాల ప్రజలు ఆయన వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు. పేదరికం స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన మీరావలి పేద ప్రజల సమస్యలు తీరుస్తారనే నమ్మకంతో ఆయన వెంట నడిచేందుకు నడుం బిగిస్తున్నారు. పంచాయతీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తారని హామీ ఇవ్వడంతో మరింతగా ఆదరణ పెరిగింది. పంచాయతీకి సంబంధించిన బిజివేముల వెంకటరెడ్డి, షేక్ ఖాన్ సావళి, తుపాకుల వెంకటసుబ్బయ్య, చేజర్ల సత్యం, గిద్దలూరు మీరావలి, చేజర్ల రోశయ్య, అనకర్ల సింహాద్రి, యడవల్లి రవి, వడ్లపల్లి పెంచిలయ్య, భాస్కర్ రెడ్డి, నల్లిపోగు రవి, చింతపల్లి తిరుపత్తయ్య, పకీరయ్య, నల్లిపోగు గోపాల్ తదితరులు మీరావలి వెంట నడుస్తూ విజయకేతనం ఎగరవేసేందుకు నడుంబిగిస్తున్నారు.