మర్రిపాడు ఎంపీపీగా పుట్టం ప్రమాణ స్వీకారం
మర్రిపాడు, మేజర్ న్యూస్ : మర్రిపాడు మండల ఎంపీపీగా పుట్టం విజయనిర్మలారెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మండలంలో 13 సెగ్మెంట్లకు గాను 11 సెగ్మెంట్లలో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరవేయడంతో ఆ ఎంపీటీసీలు పుట్టం విజయనిర్మలారెడ్డిని ఎంపీపీగా ఎన్నుకోనున్నారు. ఈ తరుణంలో మధ్యాహ్నం మూడు గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు కూటమి పార్టీ శ్రేణులు తెలియజేశారు. అందువలన ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటుగా జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు.