గ్రంథాలయ వారోత్సవాలలో మ్యూజికల్ చైర్స్ పోటీలు..
తంబళ్లపల్లె మేజర్ న్యూస్: జాతీయ 59వ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా తంబళ్లపల్లె శాఖ గ్రంధాలయం ఆధ్వర్యంలో విద్యార్థులకు క్విజ్ మరియు మ్యూజికల్ చైర్స్ పోటీలు నిర్వహించారు. గురువారం తంబళ్లపల్లి ప్రాథమిక పాఠశాలలో గ్రంథాలయ అధికారి జిలాని భాష, హెడ్మాస్టర్ మొగిలీశ్వరయ్య ల ఆధ్వర్యంలో పాఠశాలలో విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికి తీయడానికి క్విజ్ పోటీలు దోహదపడతాయని వారు తెలిపారు. అదేవిధంగా విద్యార్థుల్లో క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందుతుందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మ్యూజికల్ చైర్స్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు , విద్యార్థులు పాల్గొన్నారు.
రిపోర్టర్: గౌరీ శంకర్, తంబలపల్లి