BREAKING
సొంత చెల్లిపై విషపు రాతలతో దిగజారుడు రాజకీయాలు : జగన్ పై మన్నవ మోహనకృష్ణ సంచలన వ్యాఖ్యలు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు నాయుడు దక్షతతొ రాష్ట్రాభివృద్ధి: ఎమ్మెల్యే నసీర్ డిసెంబర్ 11 నుంచి ఖేలో ఇండియా పోటీలు..లోగో, మస్కట్ గోడ పత్రికలను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్.. నేటి నుండి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం నిన్న వైసీపీ కండువా.. నేడు అమిలినేని సమక్షంలో టిడిపి కండువా వేసుకున్న నాయకులు. బాలీవుడ్ సంగీతంలో ఇప్పుడు సృజనాత్మక స్వేచ్ఛ కరువైంది.. లెజెండరీ సింగర్ కుమార్ సాను సంచలన వ్యాఖ్యలు కలకలం రేపుతున్న పెద్దపులి సంచారం వివాహ వార్షికోత్సవం, జన్మదినం సందర్భంగా అన్నప్రసాద వితరణ* బాలీవుడ్ చిత్రాల్లో సరికొత్త ట్రెండ్‌గా క్యారెక్టర్ రివీల్స్.. రామాయణంలో హనుమంతుడిగా సన్నీ డియోల్ పాత్ర హైలైట్ ఉక్రెయిన్‌కు మరో 45 బిలియన్ యూరోల రుణ సాయం ఇరాక్‌లో కతైబ్ హెజ్బొల్లా మిలీషియా ప్రాధాన్యత ఏమిటి కూతురి ఫోటోలు షేర్ చేయవద్దు.. పాప ప్రైవసీని గౌరవించండి అంటూ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ విజ్ఞప్తి రబీలో సాగు చేసే పంటలకు బీమా చేయించుకోవాలి. ఏవో యోకోసుకా నావల్ బేస్‌ను సందర్శించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

అద్దంకి మండలంలో తొలిరోజు నామినేషన్ల ప్రశాంతం. సర్పంచ్ స్థానాలకు 11 వార్డ్ సభ్యులకు 11 నామినేషన్ పత్రాలు దాఖలు.

Select Suryaa Now
అద్దంకి మండలంలో తొలిరోజు నామినేషన్ల ప్రశాంతం. సర్పంచ్ స్థానాలకు 11 వార్డ్ సభ్యులకు 11 నామినేషన్ పత్రాలు దాఖలు.
మండలంలో ప్రశాంతంగా తొలిరోజు నామినేషన్ల ప్రక్రియ.
సర్పంచ్ స్థానాలకు 11, వార్డు సభ్యులకు 11 దాఖలు.
మండలంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ తొలిరోజు ఉత్సాహంగా, ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది. మండల పరిధిలోని వివిధ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ మరియు వార్డు సభ్యుల స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.   మండలంలోని మొత్తం 26 గ్రామ పంచాయతీలకు 8 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మండల వ్యాప్తంగా సర్పంచ్ స్థానాలకు మొత్తం 11 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో భాగంగా బొమ్మనపాడులో 2, చక్రాయపాలెం 1, చినకొత్తపల్లి 1, గోపాలపురం 1, కలవకూరు 2, మోదేపల్లి 1, సింగరకొండపాలెం 2, ఉప్పలపాడు 1 చొప్పున సర్పంచ్ నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీవో వరూధిని తెలిపారు. అలాగే వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించి గోపాలపురం 2, కలవకూరు 2, రామాయపాలెం 1, సింగరకొండ పాలెం 6 చొప్పున మొత్తం 11 మంది వార్డు సభ్యులు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.ఎన్నికల అధికారులు నామినేషన్ల స్వీకరణకు తగిన ఏర్పాట్లు చేయడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రక్రియ సజావుగా సాగుతోంది. పోలీసులు నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.