BREAKING
కూతురి ఫోటోలు షేర్ చేయవద్దు.. పాప ప్రైవసీని గౌరవించండి అంటూ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ విజ్ఞప్తి రబీలో సాగు చేసే పంటలకు బీమా చేయించుకోవాలి. ఏవో యోకోసుకా నావల్ బేస్‌ను సందర్శించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆర్ట్స్ కళాశాలలో ఘనంగా నేషనల్ నేచురోపతి డే ఇందిరమ్మ ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఆధారం.. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న దద్దవాడ నాయకులు ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన డిడిఓ అమానుల్లా. రోమ్‌లో భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్ పర్యటన ధరల నియంత్రణే కూటమి ప్రభుత్వ లక్ష్యం - ఎమ్మెల్యే ముత్తుముల ఘనంగా జడ్పీజిహెచ్ఎస్ లో స్వయం పరిపాలన దినోత్సవం ప్రశాంతతతోనే నిద్రకు ఉపక్రమించాలి అద్దంకి మండలంలో తొలిరోజు నామినేషన్ల ప్రశాంతం. సర్పంచ్ స్థానాలకు 11 వార్డ్ సభ్యులకు 11 నామినేషన్ పత్రాలు దాఖలు. మాగుంట శ్రీనివాసులురెడ్డి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన 22వ డివిజన్ కార్పొరేటర్ మద్దులూరి శేఖర్ బాబు గ్రంథాలయ వారోత్సవాలలో మ్యూజికల్ చైర్స్ పోటీలు.. అంతర్జాతీయ మార్కెట్లలో భారత ఎగుమతుల జోరు

రాప్తాడు బాలిక ఒక ఫైటర్‌.. త్వరలోనే కోలుకుని వస్తుంది: మంత్రి నారా లోకేష్

Select Suryaa Now
రాప్తాడు బాలిక ఒక ఫైటర్‌.. త్వరలోనే కోలుకుని వస్తుంది: మంత్రి నారా లోకేష్

అమరావతి, మేజర్‌న్యూస్‌ :

 ఆ బాలిక ఒక ఫైటర్‌.. ఎంతో ధైర్యంగా ప్రాణాలతో పోరాడింది. ఇప్పుడు అదే ధైర్యంతో కోలుకుంటోంది. త్వరలోనే ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వస్తుంది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయితే మా బాధ్యత తీరిపోయినట్లు కాదు. తను పూర్తిగా కోలుకుని, మళ్లీ మునుపటిలా నవ్వుతూ, సంతోషంగా సాధారణ జీవితాన్ని గడిపే వరకు తనదే బాధ్యత  అని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. రాప్తాడులో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక ఆరోగ్య పరిస్థితిపై మంత్రి లోకేష్ ప్రత్యేకంగా ఆరా తీశారు. ఉండవల్లి నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యులతో మాట్లాడారు. బాలిక ఆరోగ్యంలో వస్తున్న మార్పులు, ప్రస్తుతం అందిస్తున్న చికిత్స, డిశ్చార్జ్ అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా తెలుసుకున్నారు. బాలిక వేగంగా కోలుకుంటోందని వైద్యులు చెప్పడంతో మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.

మా అమ్మాయి మళ్లీ నవ్వుతోంది.. నడుస్తోంది!

బాలిక ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదల కనిపిస్తోందని మణిపాల్ ఆసుపత్రి వైద్యులు మంత్రి లోకేష్‌కు వివరించారు. ప్రస్తుతం వెంటిలేటర్ అవసరం లేకుండానే శ్వాస తీసుకుంటోందని, ఆక్సిజన్ స్థాయిలు స్థిరంగా ఉన్నాయని తెలిపారు. నోటి ద్వారా ఆహారం తీసుకుంటోందని, ప్రధాన గాయాలు మానిపోయాయని చెప్పారు. కుట్లు తొలగించామని, చిన్నపాటి గాయాలకు చికిత్స కొనసాగుతోందని వివరించారు. బాలిక ఇప్పుడు ఇతరుల సహాయంతో నెమ్మదిగా నడుస్తోందని, గతంతో పోలిస్తే ఎక్కువ అడుగులు వేస్తోందని తెలిపారు. కుడిచేత్తో నీళ్ల గ్లాసు పట్టుకునే స్థాయికి చేరుకుందని, పెన్ను పట్టుకుని రాయడానికి అవసరమైన శిక్షణ కూడా ప్రారంభించామని చెప్పారు. గతంలో జరిగిన విషయాలను గుర్తుచేసుకోగలుగుతోందని వివరించారు. రెండు రోజుల క్రితం నవ్వమని అడిగితే ఆ అమ్మాయి నవ్వింది. ఆ నవ్వు చూసి మాకెంతో సంతోషం కలిగింది. తనలో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. బాలిక నిజంగా ఒక ఫైటర్‌ అని వైద్యులు చెప్పడంతో మంత్రి లోకేష్ భావోద్వేగానికి లోనయ్యారు.

డిశ్చార్జ్‌తో మా బాధ్యత ముగియదు!

ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. "ఆ అమ్మాయి మన బిడ్డ. తను ఎదుర్కొన్న బాధను మాటల్లో చెప్పలేం. ఇంత చిన్న వయసులో అంతటి బాధను అనుభవించినా ఎంతో ధైర్యంగా పోరాడింది. తనను మళ్లీ మామూలు జీవితంలోకి తీసుకురావడమే మనందరి లక్ష్యం. శారీరక గాయాలు మానిపోయినా, మనసుకు తగిలిన గాయం నుంచి బయటపడటానికి సమయం పడుతుంది. అందుకే తనకు వైద్యంతో పాటు ప్రేమ, ఆప్యాయత, మానసిక ధైర్యం కూడా అందించాలి" అని అన్నారు. తను మళ్లీ స్వేచ్ఛగా నడవాలి. తన చేతులతో రాయాలి. తోటి పిల్లలతో కలిసి సంతోషంగా గడపాలి. తన కలలను నెరవేర్చుకునేలా ఎదగాలి. అందుకు అవసరమైన ప్రతి సహాయాన్ని అందిస్తాం. తను పూర్తిగా కోలుకునే వరకు తన బాధ్యత నేను తీసుకుంటాను. ఆ కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటాను అని మంత్రి భరోసా ఇచ్చారు.

ఇంటికి వెళ్లాక కూడా బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాలి

బాలిక త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే దశకు చేరుకుంటోందని వైద్యులు తెలిపారు. అయితే డిశ్చార్జ్ తర్వాత కూడా పునరావాస చికిత్స, మానసిక మద్దతు, అవసరమైన తదుపరి శస్త్రచికిత్సలు కొనసాగించాల్సి ఉంటుందని వివరించారు.దీనిపై మంత్రి లోకేష్ స్పందిస్తూ.. బాలిక ఇంటికి వెళ్లిన తర్వాత కూడా వైద్య సంరక్షణలో ఎలాంటి లోటు ఉండకుండా ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేశారు. స్థానికంగా మానసిక వైద్య నిపుణుడిని అందుబాటులో ఉంచుతామని, అనంతపురం సర్వజన ఆసుపత్రి సహకారంతో పునరావాస చికిత్స కోసం ప్రత్యేక థెరపిస్ట్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆర్థోపెడిక్ చికిత్స, ఫిజియోథెరపీ, భవిష్యత్తులో అవసరమయ్యే శస్త్రచికిత్సలపై మణిపాల్ వైద్యులు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కోరారు. ఇంటి వద్ద ఎలాంటి ఇన్ఫెక్షన్లు, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారాలకు  సూచించారు.

 ప్రాణాలు కాపాడిన మీ అందరికీ రుణపడి ఉంటాం

బాలిక ప్రాణాలను కాపాడేందుకు కృషి చేసిన మణిపాల్ ఆసుపత్రి వైద్య బృందానికి మంత్రి లోకేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. "మీరు కేవలం వైద్యం చేయలేదు. ఒక చిన్నారి ప్రాణాలను కాపాడారు. ఒక కుటుంబంలో మళ్లీ ఆశలు చిగురించేలా చేశారు. ఆ బిడ్డ మళ్లీ నవ్వుతోందంటే మీ అందరి కృషే కారణం. మీ సేవలను ఎప్పటికీ మర్చిపోలేం" అని వైద్యులను అభినందించారు. అనంతపురంలో సకాలంలో ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులను కూడా ప్రత్యేకంగా ప్రశంసించారు. బృందంలోని ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక డాక్టర్  బాలికతో తెలుగులో మాట్లాడుతూ ఆమెకు, తల్లిదండ్రులకు ధైర్యం కల్పిస్తున్నారని వైద్యులు తెలిపారు. బాలిక కోలుకుంటున్న తీరు పట్ల తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారని, మొదటి నుంచీ శ్రద్ధ తీసుకుంటున్న మంత్రి లోకేష్‌కు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారని వివరించారు.