BREAKING
కూతురి ఫోటోలు షేర్ చేయవద్దు.. పాప ప్రైవసీని గౌరవించండి అంటూ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ విజ్ఞప్తి రబీలో సాగు చేసే పంటలకు బీమా చేయించుకోవాలి. ఏవో యోకోసుకా నావల్ బేస్‌ను సందర్శించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆర్ట్స్ కళాశాలలో ఘనంగా నేషనల్ నేచురోపతి డే ఇందిరమ్మ ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఆధారం.. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న దద్దవాడ నాయకులు ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన డిడిఓ అమానుల్లా. రోమ్‌లో భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్ పర్యటన ధరల నియంత్రణే కూటమి ప్రభుత్వ లక్ష్యం - ఎమ్మెల్యే ముత్తుముల ఘనంగా జడ్పీజిహెచ్ఎస్ లో స్వయం పరిపాలన దినోత్సవం ప్రశాంతతతోనే నిద్రకు ఉపక్రమించాలి అద్దంకి మండలంలో తొలిరోజు నామినేషన్ల ప్రశాంతం. సర్పంచ్ స్థానాలకు 11 వార్డ్ సభ్యులకు 11 నామినేషన్ పత్రాలు దాఖలు. మాగుంట శ్రీనివాసులురెడ్డి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన 22వ డివిజన్ కార్పొరేటర్ మద్దులూరి శేఖర్ బాబు గ్రంథాలయ వారోత్సవాలలో మ్యూజికల్ చైర్స్ పోటీలు.. అంతర్జాతీయ మార్కెట్లలో భారత ఎగుమతుల జోరు

శిశువుల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వండి.. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వెంకట్.

Select Suryaa Now
శిశువుల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వండి.. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వెంకట్.

తంబళ్లపల్లె, మేజర్ న్యూస్, 
నవజాత శిశువుల భద్రత ఆరోగ్య సంరక్షణ కు ప్రాధాన్యత నివ్వాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వెంకట్ సూచించారు. గురువారం సిహెచ్సిలో జాతీయ నవజాత శిశువుల వారం దినోత్సవం సందర్భంగా మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా నవంబర్ 15 నుండి 21వ తేదీ వరకు నవజాత శిశువుల వారం నిర్వహించి శిశువుల ఆరోగ్యం, భద్రత, సంరక్షణ ప్రాముఖ్యతను వివరించనున్నట్లు చెప్పారు. చిన్నారుల భవిష్యత్తు కోసం క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు మరియు ఫాలో అప్ వైద్య సంరక్షణ అందించడం జరుగుతుందన్నారు. నవజాత శిశువు పుట్టిన 28 రోజులు శిశువులకు ఎంతో కీలకమైనవని అదే విధంగా శిశు మరణాల రేటు తగ్గించడం ముందస్తు జననాలు ఇన్ఫెక్షన్ల నివారణ, తల్లిపాల ప్రాముఖ్యత మరియు సరైన వైద్య సంరక్షణ పై ప్రజల్లో అవగాహన పెంచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు అమర సింహరాజు, సుమలత, ఐసిటిసి కౌన్సిలర్ చంద్రమోహన్, ఎల్టి బాలాజీ, నర్సులు, వైద్య సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు

 రిపోర్టర్: గౌరీ శంకర్ తంబలపల్లి