సలకలవీడు సర్పంచ్ అభ్యర్థిగా బిక్క కోటమ్మ నామినేషన్ దాఖలు
బేస్తవారిపేట, మేజర్‌న్యూస్ :
బేస్తవారిపేట, మండలం సలకలవీడు గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలోకి బిక్క కోటమ్మ దిగారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున మంగళవారం ఆమె సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
వైఎస్సార్సీపీ నాయకుడు బిక్కా రామాంజినేయులు రెడ్డి తల్లిగా బిక్క కోటమ్మ గ్రామ ప్రజలకు సుపరిచితురాలు. గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం, రహదారుల అభివృద్ధి, పారిశుధ్యం, వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు. మహిళలు, వృద్ధులు, యువత, రైతుల సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని గ్రామాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తానని తెలిపారు.
బిక్క కోటమ్మ నామినేషన్ దాఖలు చేయడంతో సలకలవీడు గ్రామంలో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆమెకు మద్దతు తెలిపారు.
సలకలవీడు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన బిక్క కోటమ్మకు పార్టీ శ్రేణులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు....