జీజీహెచ్ కు స్ట్రచర్లను అందజేసిన స్వచ్ఛంద సేవకులు
ప్రభుత్వాసుపత్రికి వచ్చే వందలాదిమంది రోగులకు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వంతోపాటు దాతలు సహకరించటం ద్వారానే మరింతగా మెరుగైన సేవలు అందుతాయని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.దుర్గాప్రసాద్ అన్నారు.పలువురు స్వచ్ఛంద సేవకులు రోగుల సౌకర్యం కోసం సహాయంగా మూడు స్ట్రచెర్లను సూపరింటెండెంట్ దుర్గా ప్రసాద్ ద్వారా సూపరింటెండెంట్ కార్యాలయం ముందు ఆసుపత్రి సేవలకు అందజేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సూపరింటెండెంట్ డాక్టర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులను అత్యవసర పరిస్థితులలో ఒకచోట నుండి మరొకచోటకు వివిధ రకాల పరీక్షల నిమిత్తం, ఆపరేషన్ల నిమిత్తం స్ట్రక్చర్స్, వీల్ చైర్స్ ఎంతగానో ఉపకరిస్తాయని అన్నారు.నిరంతరం వాడటం వలన ప్రతి సంవత్సరం రిపేర్లకు రావటం,కొన్ని పాడవటం వలన ఎప్పటికప్పుడు కొత్తవి సమకూర్చుకోవాల్సి వస్తుందన్నారు.కొత్తగా దాతలు గత కొద్దికాలంలో 30 వరకు స్ట్రెచ్చర్స్ అందించారని ఇంకా 100కు పైగా అవసరం ఉందని,దాతలు, స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ప్రజా ఆలోచనా వేదిక అధ్యక్షులు మేడూరి రాజేంద్రప్రసాద్, ప్రభుత్వ ఆసుపత్రి లైజాన్ ఆఫీసర్ డాక్టర్ జ్యోతుల మురళి కృష్ణ,కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ శ్రీకాంత్,వల్లూరి వెంకటేష్ సుష్మ, హన్విక్, అడ్మినిస్ట్రేటర్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.
అనిల్ కాంత్.కె....గుంటూరు ప్రతినిథి