హైవే ప్రాంతంలో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
వెల్దుర్తి, మేజర్ న్యూస్: జాతీయ రహదారి-44 (ఎన్‌హెచ్-44) రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా విద్యుత్ స్తంభాలను మారుస్తున్నందున గురువారం (నవంబర్ 19) ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదని విద్యుత్ శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విద్యుత్ అంతరాయం కేవలం హైవే ప్రాంతానికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. ప్రజలు, విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.