టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల వెంకటేష్ యాదవ్‌ను కలిసిన సత్తెనపల్లి మున్సిపల్ చైర్మన్
గుంటూరు: సత్తెనపల్లి మున్సిపల్ చైర్మన్ మారెళ్ల రామాంజినేయులు బుధవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల వెంకటేష్ యాదవ్ ని వారి నివాసంలో మర్యాదపూర్వ కంగా కలిశారు.ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పార్టీ విజయానికి, తన గెలుపునకు తాళ్ల వెంకటేష్ యాదవ్ అందించిన విశేష సహకారానికి ఈ సందర్భంగా రామాంజినేయులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం, త్వరలో జరగనున్న తన మున్సిపల్ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తప్పక విచ్చేసి ఆశీర్వదించాల్సిం దిగా కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ భేటీలో పలువురు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సూర్య నాయక్