అవకాశం ఇవ్వండి పెద్దకూరపల్లి పంచాయతీని అభివృద్ధి చేస్తా : వైసీపీ బలపరిచిన అభ్యర్థిని కె.దవణమ్మ విజ్ఞప్తి
రామసముద్రం,మేజర్ న్యూస్ : మండల పరిధిలోని పెద్దకూరపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలోకి కె.దవణమ్మ దిగుతున్నారు.మాజీ సర్పంచ్ రెడ్డప్ప నాయుడు సతీమణి అయిన దవణమ్మను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) బలపరిచిన అభ్యర్థిగా ప్రకటించారు.గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆమె అభ్యర్థిత్వం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.గ్రామంలో ప్రజలతో మమేకమవుతూ నామినేషన్ వేసేందుకు ప్రచారానికి సిద్ధమవుతున్నారు.గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు.సర్పంచ్‌గా అవకాశం లభిస్తే గ్రామాభివృద్ధికి కృషి చేయడంతోపాటు ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తాననే లక్ష్యంతో ఆమె ఎన్నికల బరిలో నిలుస్తున్నారు.
రిపోర్టర్ : హరినాథ్,రామసముద్రం మండలం